4 - వ తరంగము.
ప్రలంబబాహువుకథ.
ఈరీతిని తండ్రియింట గోముఖాదిమంత్రులచే సేవ్యమానుఁ డై అత్యంతాను రక్త యయిన యలంకారవతీదేవితో విహరించుచు ఉండి, నరవాహనదత్తుఁడు, ఒకనాఁడు, ప్రలంబబాహువు ముందు నడువ, గోముఖసమేతుఁడై రథ మెక్కి అనుచరులతోఁగూడి వనమునకు వేఁటకుఁ బోయెను. రథాశ్వములు ఎంతవేగముగా పరు గెత్తినను ప్రలంబబాహువు వానిని అతిక్రమించి ముందే పోవుచుండెను. రాజు సింహవ్యాఘ్రాదులను రథమునం దుండియే బాణములతోఁ గూల్చుచుండెను ఫ్రలంబబాహువు పాదచారిగానే వానిని కత్తితో సంహరించెను. 'ఏమి ఇతని శౌర్యము! ఏమి యితని పిక్కబలము!' అని నరవాహనదత్తుఁడు ఆవిప్రవీరుని చూచి చూచి ఆశ్చర్యపడెసు. వేఁట ముగించి బడలి సారథి గోముఖ సమేతుఁ డై ప్రభువు రథమెక్కి, మహావీరుఁ డయిన ప్రలంబబాహువు ఆగ్రేసరుఁడుగా దప్పిచే జలము వెదకుచు మఱియొక మహావనము చొచ్చెను. అచట వికసించిన బంగారుకమలములతో నిండిన యొక మహాసరస్సును బహురవిబింబ మయిభూగత మయిన యాకసమో యన నొప్పుచుండఁగా చూచి అందు నీరాడి జలము త్రాగి