Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరవరుని కథ.

933

యాశ్చర్యపడెను. అంతట వీరవరుఁడు పుత్త్రుని సత్త్వవరుని బుజముపైఁ గొని బయలు వెడలెను. భార్య ధర్మవతియు కొమారితను వీరవతిని గొని అతనివెంటనే పోయెను.

విక్రమతుంగ మహారాజు వారి వెంటనే ప్రచ్ఛన్నుఁ డై చండికాగృహమునకు పోయెను. అచట తండ్రిబుజమునుండి దిగి సత్త్వవరుఁడు దేవిని నమస్కరించి యిట్లు విన్నవించెను. 'దేవీ నాశిరమును బలి గొనుము. మాప్రభువు విక్రమతుంగ మహారాజు శాశ్వతముగా పృథివిని ఏలు చుండును గాక' ఆమాటకు తండ్రి సంతోషించి కత్తి దూసి కుమారునిశిరమును ఖండించి 'రాజునకు శ్రేయము కలుగుఁ గాక' అని పలుకుచు చండికాదేవికి అర్పించెను. స్వామి భక్తులకు పుత్త్రునియందుఁ గాని తమయందుఁ గాని స్పృహ యుండదు గదా. "బళి! వీరవరా! నీవు కొమారుని ప్రాణము నిచ్చి స్వామి ప్రాణమును కాపాడితివి!" అని ఆకాశవాణి పలికెను. రాజు అత్యాశ్చర్య మగ్నుండై అది యెల్ల చూచుచు వినుచు ఉండఁగా, వీరవతి యను కన్య అన్న తలను ఎత్తి కౌఁగిలించుకొని ముద్దుపెట్టుకొని 'హా! అన్నా!' అని యేడ్చి గుండెపగిలి చచ్చిపోయెను. కొమరితయు గతించుట చూచి వీరవరునిభార్య ధర్మవతి కేలు మోడ్చి వీరవరునితో నిట్లనియె. 'రాజునకు మేలు చేసితివి, కనుక, ఇఁక నాకు సెల విమ్ము. నేను ఈ యిరువురు పిల్లలతోను అనల ప్రవేశము చేసెదను. ఏమియు నెఱుఁగని యిట్టిపసికూన కూడ