Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

730

కథాసరిత్సాగరము. లం. 8. త. 2

గలవై లెక్కకు మిక్కుట మైన లొట్టిపిట్టలతోను, పురము ప్రవేశించి తనయొక్క దిగ్విజయ విభవములను విలాసముగా లోకులకు చూపి వినోదము చేసెను.

ఆ సమయమందు ఆ మహాభోగి యున్న యా శాకలనగరము బహువసువును భూరినిథానము నై అమరాన త్యలకాభోగవతీ నగరములనే ఒకటిగా చేర్చి నిర్మించినయట్లు ఒప్పుచుండెను. సూర్యప్రభుఁడు మదనసేనతో యథాభిమతభోగము లనుభవించుచు, తండ్రితోను, మంత్రులతోను, తనయితర భార్యలతోను సుఖ మున్నవాఁ డై మయాసురుఁడు వచ్చెద నన్నప్రకారము అతనిరాక నెదురు సూచు చుండెను.


2 - వ తరంగము.


అనంతరము ఒక నాఁడు చంద్రప్రభ మహారాజును సూర్యప్రభుఁడును తమ యాస్థానమందు సమస్తసచివసమేతులై యుండఁగా, సిద్ధాథాన్‌దులు చెప్పుచున్న కథలలో మయాసురుని ప్రస్తావము స్మృతియు రాఁగా ఆకస్మికముగా సభామధ్యములో భూమి బొక్కపడి అందునుండి మొదట సశబ్దముగా పరిమళవంత మయిన వాయువు వీచి పిమ్మట మయాసురుఁడు వెలువడెను. కృష్ణాన్నతశిరుఁడును, శృంగజ్వలత్కేశ మహౌషధియు రక్తాంబరోచ్చలద్ధాతువు నై రాత్రియందు పర్వ