పాపము తీఱని కార్పటికుని కథ.
923
కుఁడు సంతోషించి రాజునొద్దకు వచ్చి ఎదుట గూర్చుండెను. వానిని రాజు ఏ దయినను మంచి సూక్తిని పాడు మనెను. కార్పటికుఁడు పాడెను.-
గీ. నిండినట్టివాని నిండించు నెప్పుడు
సాగరమును నదుల సమితివోలె,
మెట్ట నయిన మెట్ట దొట్టు పెట్టినయట్టు
లధను కనుల మ్రోల నబ్జనిలయ.
దానిని విని మరల పాడించి రాజు మిక్కిలి సంతసించి గొప్ప గొప్ప రత్నములు నిండి యున్న యా మాతులుంగ ఫలమును ఇచ్చెను. ‘ఈరాజు ఎవనికి సంతసించునో వాని దారిద్ర్యమును పోఁగొట్టును. పాపము ఈ కార్పటికుఁడు కేవలము అదృష్ట హీనుఁడు. రాజు సంతోషించియు వీనికి ఈమాతులుంగమును ఇచ్చినాఁడు. అదృష్టహీనులకు కల్పవృక్షముగూడ మోదుగు అగును.' అని ఆ యోలగములో అందఱును పరమార్థము నెఱుఁగక విషాదముతో ఒండొరువులతోఁ బల్కికొనుచుండిరి. కార్పటికుఁడు మాతులుంగమును గ్రహించి వెడలిపోయి చింతించుచుండెను. వాని యెదుటికి రాజవందియను భిక్షు వొకఁడు వచ్చి వానికి తన శాటి యిచ్చి మనోహర మయిన యా మాతులుంగమును కైకొని రాజదర్శనము చేసి దానిని కానుక పెట్టెను. రాజు దానిని గుర్తుపట్టి శ్రమణుని 'భదంతా,
ఈఫలము నీ కెక్కడిది ?' అని యడిగెను. కార్పటికుఁ డిచ్చె