922
కథాసరిత్సాగరము. లం. 9. త. 3
లేదు. వేఁట సాలించి వచ్చి రాజు నగరు సొచ్చెను. కార్పటికుఁడు ఎప్పటి యట్లు సింహద్వారమందు నిలుచుండెను. ఒకమాఱు లక్షదత్తునకు ఎల్లజగడముచే దాయాదులతో మహాయుద్ధము జరిగెను. ఆ యుద్ధమునందు రాజు నెదుట కార్పటికుఁడు గట్టి చండ్రదుడ్డు తలదెబ్బలతో శత్రువుల ననేకులను మడియించెను. రాజు శత్రువులను జయించి తన నగరమునకు వచ్చెను. అట్లు కార్పటికుని పరాక్రమము చూచియు వానికి ఏమియు ఈయ లేదు. రాజును కార్పటికుఁడును ఈరీతిని ఉండఁగా అయిదు సంవత్సరములు గడచినవి. కార్పటికుఁడు తన దుడ్డుకఱ్ఱచేతనే జీవించు చుండెను.
ఆఱవ సంవత్సరము రాఁగా రాజు ఒకనాఁడు దైవ యోగమున వానిపై కనికరించి యిట్లు చింతించెను. - 'వీనికి ఎంతకాలము కష్టపడినను ఇప్పటికి ఏమియు ఇయ్యనైతిని. ఇప్పుడు యుక్తిగా వీని కేమయిన ఇచ్చి చూచెదను. ఈ దీనునికి పాపక్షయ మయినదో లేదో, ఇప్పటి కైనను లక్ష్మి వీనికి దర్శనమిచ్చునో ఈయదో, చూచెదను గాక, ' ఇట్లు ఆలోచించి రాజు స్వయముగా కోశాగారమునకుఁ బోయి యొక మాతులుంగ ఫలమును బరిణవలె చేసి రత్నములతో నిండించెను. బయటనే నిండోలగంబు తీర్చెను. పౌర సామంత మంత్రు లందఱును ప్రవేశించిరి. వారిమధ్యలో కార్పటికుఁడు గూడ ప్రవేశింపఁగా రాజు వానిని దగ్గఱకు రమ్మని స్నేహముగా పలికెను. కార్పటి