పాపము తీఱని కార్పటికుని కథ.
921
క్షయించెనా ప్రయత్న పూర్వకముగా నివారించినను ఇయ్యనే ఇచ్చును. ఇది కర్మవశము గదా.
పాపము తీఱని కార్పటికుని కథ.
పూర్వము ఈ లోకములో లక్షపుర మని యొక నగర ముండెను. అందు దాత్రగణి లక్షదత్తుఁడు అని రాజు ఉండెను. అతఁడు యాచకునికి లక్షకు తక్కువ యిచ్చి యెఱుఁగఁడు. ఎవనితో పలుకునో వానికి లక్ష, ఎవనితో సంతోషించెనో వానిని నిర్దారిద్ర్యునే చేసెను. అందువలననే అతనికి లక్షదత్తుఁ డని పేరు కలిగెను. అతని సింహద్వారమున లబ్ధదత్తుఁడను కార్పటికుఁడు తోలుగోచి మాత్రము గలిగిన జడదారి చలిలోను వానలోను మండు వేసవి యెండలోను కదలక నిలిచి యుండెను. అట్లు ఎంతకాలము కష్టపడుచు నిలిచి యున్నను వానికి రాజు దాత యయ్యును దయాళు వయ్యును ఏమియు ఈ లేదు. ఒకనాఁడు రాజు వేఁటకుఁ బోయెను. కార్పటికుఁడు దుడ్డుగుదియ చేతఁ గొని కూడఁ బోయెను. అడవిలో రాజు ససైన్యుఁ డై 'వాహనమంద ఉండి ధనుస్సు ఎక్కు వెట్టి బాణప్రయోగముచేసి వ్యాఘ్రములను వరాహములను లేళ్లను చంపుచుండెను. కార్పటికుఁడు రాజుమ్రోల పాదచారియై దుడ్డుతోనే వ్యాఘ్ర వరాహ హరిణములను అనేకములను కొట్టి చంపెను రాజు దానిని చూచి, 'ఆహా వీఁడు ఎంతటి శూరుఁడు!' అని ఆశ్చర్యపడి సంతోషించెనే గాని, వానికి ఏమియు ఇయ్య