Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

920

కథాసరిత్సాగరము. లం. 9. త. 3

ప్రీతియుక్త యైన యామెను దోడ్కొని, నిజనగరమునకుఁ బోయి సుఖ ముండెను. ఈరీతిగా దివ్యులు తప్పు నడవడులచే శాపచ్యుతు లై మనుష్యలోకములో జనించి ఆదోషముల ఫలమును అనుభవించి, తమ పూర్వ సుకృత విశేషములచేత మరల నిజపదమును పొందుదురు.

ఇట్లు నరవాహనదత్తుఁడు గోముఖ మంత్రివలన అలంకారవతీ సమేతుఁ డై కథ విని సంతోషించి దినకృత్యములకై లేచెను.

3 - వ తరంగము.

మఱునాఁడు అలంకారవతీ సమేతుఁ డై యున్న నరవాహనదత్తునితో మిత్త్రుఁడు మరుభూతి విన్నపించెను. 'చూడు చూడు, దేవా, నీసింహద్వారమునందు జడదారి కార్పటికుఁడు మిక్కిలి ధూళి గ్రమ్మి దివారాత్రము చలిలోను ఎండలోను ఒక తోలుచీలికగోచి మాత్రము పెట్టుకొని కాచి యున్నాఁడు. అకాలమున ఎచ్చు ఇచ్చుటకంటె కాలమున కొంచె మిచ్చినను మేలు. కనుక వీఁడు చావకముందే వీనిపై కనికరింపుము.' అని. దానిని విని గోముఖుఁ డనియె. -మరుభూతి చెప్పినది సరియే గాని, 'దేవా, ఈవిషయమున నీతప్పు లేదు. పాపము క్షయించువఱకు దాత యయ్యును ప్రభువు ఇయ్యఁడు; పాపము