Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

728

కథాసరిత్సాగరము. లం. 8. త. 1

ప్రభుని తోడ్కొని జనమేజయసమేతముగా విమాన మెక్కి పడమటిదిక్కునకుఁ బోయిరి. సుభటరాజు తన కొమారిత దొరకినందులకు సంతోషించి వారిని మిక్కిలి పూజించి కొమారితకు వివాహమహోత్సవమును జరిపెను. అతఁడు కొమారిత కిచ్చిన రత్నాదికమును చూచి వీరభటాదులు తా మిచ్చిన స్వల్పమునకు లజ్జితు లయిరి.

సూర్యప్రభుఁడు అచటనే మామగారియింట నుండఁగా లావాణకమునుండి పౌరవరాజు దూత వచ్చి తన యేలిక వచనముగా ని ట్లనియె:- 'నాకొమారితను మీ కుమారుఁడు అపహరించినాఁడు. అందులకు నాకు చింత లేదు. మీరు అతనిని తోడ్కొని మాయింటికి రాఁ గూడదా ? లోకాచారమయిన వివాహకార్యమును చేసెదను.' వెంటనే చంద్రప్రభుఁడు ప్రహస్తునితో సులోచనను తండ్రియొద్దకు పంపి మఱునాఁడు సుభటునిఁగూడ తోడ్కొని ఎల్లవారును సులోచనా సూర్యప్రభులతో విమాన మెక్కి లావాణకమునకు పోయిరి. పౌరవుఁడు వివాహోత్సవము జరిపి రాజుల నెల్ల సత్కరించెను.

అతనివలన ఉపచర్యలు పొందుచు వీ రందఱు అచట నుండఁగా చీననరేంద్రుఁడు సురోహుఁడు దూతను పంపెను. కన్యలను కోలుపోయిన యితర రాజులవలె తానును వారిని తనయింటికి రమ్మని దూతముఖముగా నడిగెను. అంతట చంద్రప్రభమహారాజు సంతోషించి సురోహునికూఁతును విద్యున్మా