902
కథాసరిత్సాగరము. లం. 9. త. 2
గాఁడ సేసెను. ఆమెయు ఆ యందగానిని చూచి మదన వికారమునకు లో నై 'ఇతఁ డెవరు? పుష్పచాపము వదలి వచ్చిన మదనుఁడా? లేక, గీతతుష్టుఁ డైన శివుని యనుగ్రహ మిట్లు మూర్తీభవించి వచ్చుచున్నదా యేమి?' అని తలపోసి, అతనిని 'నీ వెవరవు? ఈవనమున కేల వచ్చితివి? చెప్పుము.' అనెను. అతఁడు ఉన్నమాట చెప్పి ఆమెను "ఓతామరసాసనా, నీ వెవతెవు? ఈ నిద్రితుఁ డెవఁడు? చెప్పుము.' అని యడిగెను. ఆమె సంగ్రహముగా ననియెను. 'నేను విద్యాధిరిని. ఈతఁడు ఖడ్గసిద్ధుఁడు నాపతి. నిన్ను చూచినమాత్రాన నీ యందనురక్త నైతిని. రమ్ము; ఇతఁడు లేవక ముందే త్వరగా నీ పురికి పోదము. సర్వమును అచట సవిస్తరముగా చెప్పెదను.' అందులకు రాజు అంగీకరించి త్రైలోక్యరాజ్యము తనకు లభించినట్లు సంతోషించెను. 'ఈ రాజును ఒడిలో పెట్టుకొని త్వరగా ఆకాశమునఁ బోయెదను.' అని అనంగప్రభ మనసులో తలఁచి, ఆ భర్తృద్రోహదోషముచేత విద్యలు పోఁగా, తల్లిదండ్రుల శాపమును తలంచుకొని విషాదము నొందెను. దానిని చూచి రాజు కారణ మడిగి, ఆమెతో 'ఇది దుఃఖమునకు కాలము గాదు. నీ పతి మేలుకొనును. ఓ ప్రేయసీ, ఇది దైవాయత్తమయిన కార్యము, ఇందులకు దుఃఖము వ్యర్థము. తన తల నీడను విధిగతిని ఎవఁడు తప్పించుకొనఁ గలఁడు? రా పోదము అని పలికి ఆమెను తన మాట కొడంబఱిచి తన యొడిలోఁ