సూర్యప్రభుని కథ.
727
పోయెను. ఆదేవుఁడు సద్భక్తులను ఇహపరములందు రక్షించువాఁడు గదా. దామోదరుని యనుచరు లెల్ల ఎచటివారు అచటికి పోయిరి. సూర్యప్రభుఁడును ఆకాశమునుండి తండ్రి యొద్దకు దిగెను. మంత్రిసమేతముగా గాయపడక కుమారుఁడు రాఁగా చంద్రప్రభుఁడు సంతోషించెను. ఇతరరాజులును సూర్యప్రభుని పరాక్రమమును ప్రత్యక్షముగా చూచినవారై అతనిని పొగడిరి.
అందఱు తుష్టు లై ఆజయకథనే మరల చెప్పుకొను చుండఁగా సుభటమహారాజునొద్దనుండి దూత వచ్చి చంద్రప్రభుని యెదుట ఒకజాబు నుంచెను. సిద్ధార్థుఁడు దానిని పగులఁగొట్టి సభలో ఇట్లని చదివెను: - 'శ్రీమంతుఁడు ఉన్నతవంశ మౌక్తికమణియు నగు చంద్రప్రభభూపతికి కొంకణదేశమునుండి సుభటుఁడు సాదరముగా వ్రాయునది. - నాకొమారితను ఏదో సత్త్వము రాత్రి అపహరించికొని పోయినది. ఆమె నీకుమారునికి దొరికిన దని విని సంతోషించితిని ! కనుక మీరు మీ కుమారుని తోడ్కొని మాయింటికి వచ్చిన నాకొమారితను పరలోకమునుండి మరల వచ్చినదానింబోలె చూచి సంతోషించి వివాహకార్యము నెఱవేర్చెదను. ఇట్లు సిద్ధార్థుఁడు చదువఁగా చంద్రప్రభుఁడు సరియే యని దూతను సత్కరించెను. తత్క్షణమే పడమటిదేశమునకు సుభటునియొద్దకు 'ప్రహస్తునితో చంద్రికావతిని పంపెను. మఱునాఁడు ఎల్లవారును సూర్య