Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

898

కథాసరిత్సాగరము. లం. 9. త. 2

అనెను. జీవదత్తుఁడు రాజపుత్త్రిపై అభిమంత్రితజలంబులు సల్లి చాముండాదేవిని వేఁడెను;-


'అట్టాట్టహాససహితా,
కరంకమాలాకులా, దురాలోకా,
చాముండా, వికరాళా,
సాహాయ్య మొసంగు నాకు సత్వర మంబా'


ఇట్లు జీవదత్తుఁడు యత్నము చేసినను అబాలకు ప్రాణము రా దాయెను. అంత నతఁడు విషణ్ణుఁ డై యిట్లనియె. వింధ్యవాసినిచేత ఈఁబడిన దయినను నావిద్య నిష్ఫల మయినది. ఉపహాస భాజన మైన యీ నా బ్రదుకు ఏల?' ఇట్లు పలికి జీవదత్తుఁడు తల ఖండించుకొనువాఁడై పట్టాకత్తిని ఎత్తగానే నింగినుండి వాణి పలికెను. 'జీవదత్తుఁడా, సాహసము చేయకు; విను. ఈ యనంగరతి యనంగప్రభ యనెడు పేరి విద్యాధర కన్యక. తల్లిదండ్రుల శాపముచేత ఇంత కాలము మనుష్యాంగన యై యుండినది. ఇప్పుడు ఈదేహమును వదలి తనలోకమునకుఁ బోయి తన దేహమును పొందినది. నీవు మరల పోయి వింధ్యవాసినినే కొలువుము. ఆ దేవి ప్రసాదముచే ఈ విద్యాధరినే పొందుదువు. ఈమె దివ్యభోగములలో నున్నది. నీవు గాని రాజుగాని ఈమెకై వగవ వలదు. ఇట్లు పలికి దివ్యవాణి విరమించెను. అంతట రాజు కొమారితకు సంస్కారము జరిపి దుఃఖము మానెను. రాణియు ఓదారెను.