Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనంగరతి కథ.

893

నేనే ధరింతును; నాలవది నాకు భార్య యుండెనేని దానికి ఇత్తును. అయిదవదానిని అమ్మి జీవనము చేయుదును ' రెండవవాఁడు చెప్పెను.——'నేనువైశ్యుఁడను, నాపేరు భాషాజ్ఞుఁడు, సర్వ మృగ పక్షుల భాషలను ఎఱుంగుదును.' మూఁడవవాఁడు పలికెను. - 'నేను కత్త్రియుఁడను, పేరు ఖడ్గధరుఁడు, ఖడ్గయుద్ధమున న న్నెవఁడును గెలువ లేఁడు' నాలవవాఁడు 'నేను ద్విజోత్తముఁడను, నాపేరు జీవదత్తుఁడు చచ్చిన స్త్రీని గౌరీప్రసాదముచేతను విద్యాప్రభావముచేతను నేను బ్రదికించెదను' అనెను. ఇట్లు అందఱు పలికి, శూద్ర వైశ్య క్షత్రియులు ముగ్గురు మరల తమతమ రూప శౌర్య బలములను చెప్పుకొనిరి. బ్రాహ్మణుఁడు రూపముమాత్రము లేక బలశౌర్యములు చెప్పుకొనెను. అంతట మహావరాహరాజు దౌవారికునికి 'ఇప్పుడే వీరిని అందఱను కొనిపోయి నీయింట విశ్రమింపఁజేయుము.' అని యాజ్ఞాపించెను చిత్త మని దౌవారికుఁడు వెంటనే వారిని తనయింటికి తోడ్కొని పోయెను.

అంతట రాజు కొమారిత యనంగరతితో 'పుత్త్రీ, ఈ నలువురువీరులలో నీకిష్ట మయిన వాఁ డెవఁడు?' అని యడిగెను. ఆమె పలికెను. 'నాయనా, ఈ నలువురలో ఒకని నైన నేను ఇచ్చగింపను. ఒకఁడు శూద్రుఁడు, నేఁతగాఁడు, వానివలన నేమి ప్రయోజనము? రెండవవాఁడు వైశ్యుడు, పుణ్యాదిభాషల నెఱింగిన నేమి ప్రయోజనము? నేను క్షత్రియ నయ్యు వారి