హఠశర్మ కథ.
891
వివాహ మై, ఆమె నిన్ను త్యజించి యితరుల నాశ్రయింపఁగా దుఃఖకృశుఁడ వై రాగమోహితుఁడవు వై యిండ్లు కాల్చుట మొద లయిన పాపములు చేయుదువు.' ఇట్లు శాప మిచ్చిన ప్రలంబభుజుని పాదముల వ్రాలి యేడ్చుచు ఆపతివ్రత సురభిదత్త మొఱ యిడెను. 'నాకును శాపము పెట్టుము. ఉభయులకును మాకు సమగతి అగుఁ గాక. నాయపరాధముచే నాభర్తకు మాత్రమే క్లేశము కలుగకుండుత.' ఆ ప్రార్థనకు సంతసించి రాజు ఆమెను ఓదార్చి కొమరునికి ఇట్లు శాపాంతము ననుగ్రహించెను. 'అశోకమాలకు శాపము తీఱినప్పుడే ఇతఁడును పూర్వజన్మమును స్మరించి, శాపము తీఱి ఈదేహమును పొంది అహంకారము మాని శాపము మరవక త్వరలో నిన్ను వివాహ మై ఇచట నీతో సుఖ ముండును.' ఇట్లు ఆ రాజు పలుకఁగా ఆసాధ్వి ఎట్టకేలకు ఊఱడిల్లెను. శాపచ్యుతుఁ డైన యాస్థూలభుజుఁడను నేనే యని యెఱుంగుఁడు. అహంకార దోషముచే మహాదుఃఖము పొందితిని. గర్వితులకు శ్రేయస్సు ఎక్కడిది? నాకు ఆశాపము ఇప్పుడు తీఱినది.” ఇ ట్లని హఠశర్మ తత్క్షణమే విధ్యాధర కుమారుఁడై విద్యాప్రభావముచే అశోకమాలాదేహమును కనికరమున అదృశ్యముగా గంగలో వైచి, గంగాజలములు తెచ్చి క్షణములో అలంకారవతీవాస గృహమును క్షాళనము చేసి, భవిష్య ద్విద్యాధర చక్రవర్తిని నరవాహనదత్తుని నమస్కరించి, మింటి కెగసి, తన కార్య