హఠశర్మ కథ.
889
పుత్త్రులు లేక ఒక కన్యమాత్రము కలిగినది. దానిని తండ్రి అశోకమాల యని పేరు పెట్టి పెంచుచుండెను. ఆమె ప్రాప్త యౌవన యయి, తండ్రి ఎవని కీయఁ బోయినను అత్యంత రూపాభిమానముచే ఎవనిని వివాహ మాడ నంగీకరింపదాయెను. ఆనిర్బంధమునకు అలిగి తండ్రి ఆమెను ఇట్లు శపించెను.- ఈపేరితోనే మానుషివిగా పుట్టుము, వికృతరూపుఁ డొక బ్రాహ్మణుఁడు బలాత్కారముగా నిన్ను పెండ్లియాడును. నీవు వానిని వదలి వరుసగా ముగ్గురు భర్తలను ఆశ్రయింతువు. అప్పటికిని ఆబ్రాహ్మణుఁడు ఉపద్రవపెట్టఁగా బలవంతు నొక రాజపుత్త్రుని దాసివిగా ఆశ్రయింతువు. అప్పటికిని ఆబ్రాహ్మణుఁడు వదలఁడు. నిన్ను కనిపట్టి ఉండి ఆతఁడు చంపఁదఱుమును. రాజభవనము చొత్తువు. అచట ఈ శాపము వదలును.' అట్లు తండ్రిచే శాపము నొందిన యా విద్యాధరి యశోకమాల యే యీమె. ఈమెకు ఆశాపము తీఱినది ఈమె ఇప్పుడు తన వైద్యాధర పదమును పొంది తన మునుపటి దేహమున చేరును పిమ్మట అభిరుచితుఁ డను విద్యాధరరాజును వరించి వివాహమాడి శాపమును స్మరించుచు క్రీడించుచు.' ఇట్లు పలికి ఆకాశవాణి విరమింపఁగానే అశోకమాల ప్రాణము లెడలి నేల వ్రాలెను. దానిని చూచి అలంకారవతియు నరవాహనదత్తుఁడును పరివారముతోఁ గూడ బాష్పాయితేక్షణు లయిరి.