నరవాహనదత్తుఁడు సుందరపురమునకుఁ బోవుట.
883
మయ మై సహజ మయిన కౌతుకగృహమును పుట్టినవి 'లే, లగ్న వేళ వచ్చినది. స్నానము కానిమ్ము.' అని కృతార్థుఁ డయిన యలంకారశీలుఁడు నరవాహనదత్తుని హెచ్చరించెను. స్నానము చేసి వివాహకంకణము దాల్చిన యా నరవాహనదత్తుని వేదికి తెచ్చి యలంకారశీలుఁడు కృత వధూవేషను తన కొమారితను అలంకారవతిని దానము చేసెను. అలంకారశీలుఁడును కుమారుఁడును లాజమోక్షములయందు పెండ్లి కొమారితకు వేలకొలఁది మణి కనక వస్త్రభూషణముల బారువులను దివ్యాంగనలను ఇచ్చిరి. వివాహము ముగియఁగానే అలంకారశీలుఁడు అందఱను సమ్మానించి వీడ్కొని, భార్యాపుత్త్రులను తోడ్కొని, ఆకాశమార్గమునఁ బోయెను. ఇట్లు విద్యాధర రాజు లెల్ల వచ్చి సేవించుచున్న తనూజుని అభ్యుద యోన్ముఖుని చూచి వత్సరాజు చిరకాలము ఉత్సవము చేసెను. నరవాహనదత్తుఁడు సద్వృత్త మనోరమయు ఉదారగుణయు నైన యలంకారవతిని పొంది, అట్టివాణిని పొందిన సుకవివలె, సుఖముగా నుండెను
2 - వ తరంగము.
నరవాహనదత్తుఁడు సుందరపురమునకుఁ బోవుట.
నవవధు వైన యా యలంకారవతితో నరవాహనదత్తుఁడు తండ్రియింట ఆమెయొక్క చేటికల దివ్యనృత్తగీతము