882
కథాసరిత్సాగరము. లం. 9. త. 1
మఱునాఁడు అతఁడు ప్రాతఃకాలమందు లేచి ఆవశ్యక క్రియలు తీర్చుకొని యుండఁగా, ఆకాశమునుండి కాంచనప్రభ భర్తను అలంకారశీలుని, కుమారుని ధర్మశీలుని, కొమారితను అలంకారవతిని, తోడ్కొని వచ్చి దిగెను. వారందఱు అతని చెంతకు వచ్చి, అతనివలన గౌరవ మొంది, అతనిని యధోచితముగా అభినందించిరి. ఇంతలో వేలకొలఁది విద్యాధరులు ఆకాశమునుండి హేమరత్నాది భారములను మోచుకొని వచ్చి దిగిరి ఈ వృత్తాంతమును విని వత్సరాజు పుత్త్రుని యుత్కర్షకు సంతోషించి మంత్రులతోను భార్యలతోను అచటికి వచ్చెను.
వత్సరాజు యథార్హముగా ఆతిథ్యము చేయఁగా అతనితో ప్రణయానతుఁ డై అలంకారశీలుఁ డిట్లనియె. 'రాజా, ఈ నాతనయ యలంకారవతి పుట్టఁగానే గగనవాణి "ఈమె సర్వ విద్యాధరేంద్రులకు చక్రవర్తి కాఁగల యీనీ కొమరుఁడు నరవాహనదత్తునికి భార్య యగు నని పలికినది. కనుక దీనిని ఇతని కిచ్చెదను. వీరికి ఈలగ్నము శుభము. ఇందునిమిత్తము వీరినందఱను తోడ్కొని యిచటికి వచ్చితిని.' విద్యాధరేంద్రుని వచనమును వత్సరాజు మహానుగ్రహ మని పలికి ఆమోదించెను. అంతట నావిద్యాధరాధీశుఁడు తన విద్యాప్రభావమువలన తన యఱచేతఁ బుట్టినజలమును ఆయంగణభూమిపై చల్లెను. అంత నచట దివ్యవస్త్రచ్ఛన్న యైన బంగారపువేదియు నానారత్న