పృథ్వీ రూపరాజు కథ.
881
చేసి, ముచ్చికి గ్రామము లిచ్చి, శ్రమణులను యథార్హ ధనముల సత్కరించి, సామంత సచివ రాజపుత్త్రులను సమ్మానించి, ప్రియతమ యైన రూపలతతో జీవలోకసుఖ మనుభవించుచుండెను.
ఇట్లు గోముఖుఁడు నరవాహనదత్తునికి వినోదార్థము కథ చెప్పి, ఉత్సుకుం డయిన యతనితో మరల నిట్లనియె — ధీరులు క్లేశములతోడి విరహమును చిరకాలము సహింతురు. దేవా, నీవు ఒక రాత్రి యైనను సహింప లే వేమి? ఱేపు ప్రాతఃకాలమున నీవు అలంకారవతిని వివాహ మగుదువు. ఇట్లు గోముఖుఁడు చెప్పుచుండఁగా, అచటికి అప్పుడు వచ్చిన యౌగంధరాయణసుతుఁడు మరుభూతి యిట్లనియె. "స్మరసంతాపము నెఱుఁగని నీవు స్వస్థముగా ఏమి చెప్పవు ! పురుషుఁడు కామమునకు గుఱి కానతంసేపే ధైర్యవివేక శీలములను దాల్చును వస్త్రాంతమునకు అంటుకొన్న గడ్డిపొరకపలె మరుని దులిపివేసిన సరస్వతీ జిన స్కందులు మువ్వురే ధన్యులు.' మరుభూతి యిట్లనఁగా గోముఖుఁడు బెగడుపడి ఊరకుండెను. అంతట నరవాహనదత్తుఁడు గోముఖుని మాటను ఇట్లు సమర్థించెను: 'వినోద నార్థము గోముఖుండు అట్లు చెప్పుట యుక్తమే. మిత్త్రుఁడు విరహాయాసమున బళి బళి యనునా? యథాశక్తి విరహాతురుని స్వజనులు సమాశ్వాసింపవలయును; అటు పైని విషమ సాయకుని చిత్తము.' ఇట్లు పలుకుచును పరిజనమువలన ఆ యాకథలను వినుచును నరవాహనదత్తుఁడు ఆరాత్రి గడపెను.