Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పృథ్వీ రూపరాజు కథ.

877

ఆభిక్షువులను బహుధనము లిచ్చి సత్కరించి తనదూతతో కూడ పంపెను.

వారును సముద్రము దాఁటి ప్రతిష్ఠాననగరము చేరి రాజదర్శనము చేసి నజరు వెట్టి వృత్తము నివేదించి రూపధర సందేశమును తెలిపిరి. ముచ్చి అతనికి రూపలతాపటమును చూపెను. లావణ్యసర స్సయిన యామెదేహమును చూచుచున్న యారాజు అందు మునిఁగిన తన చూడ్కిని లేప నేరఁడాయెను. వెన్నెలను చకోరమువోలె కాంత్యమృత లహరిని ఆమెను ఆస్వాదించుచు అతనిచూపు తనియ దాయెను. రాజు చిత్రకరునితో 'మిత్త్రమా, ఈరూపమును సృజించిన వేధయు వ్రాసిన నీవుసు వంద్యులు. రూపధరమహీపతి యిష్టమును నే నంగీకరించితిని. ముక్తిపురద్వీపమునకుఁ బోయెద. ఆ కన్యను వివాహ మయ్యెద.' అని చెప్పి ఆ చిత్రకర దూత భిక్షువులను ధనము లిచ్చి సత్కరించి, చిత్తరువునే చూచుచు ఆదినమును ఉద్యానాదులయండు విరహాతురుఁ డయి గడపి, మఱునాఁడే లగ్న మేర్పఱుచుకొని ససైన్యుఁ డయి నానా హస్త్యశ్వ సామంత రాజపుత్త్ర సమేతుఁ డై, రూపధరదూత చిత్రకార శ్రమణులనుం దోడ్కొని, పయనము నడచెను.

తొలునాఁడు, మంగళఘట మను నాగేంద్రము నెక్కి సాగి, సాయంకాలమున వింధ్యారణ్య ముఖమున విడిసెను. మఱునాఁడు, శత్రుమర్దన మను నిభరాజము నెక్కి ఆ యరణ్య