Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

876

కథాసరిత్సాగరము. లం. 9. త. 1

గోరి 'ఓయి, భూమండల మెల్ల తిరిగితివి గదా, ఎచట నైనను నాకొమారితకు సాటి స్త్రీనిగాని పురుషునిఁగాని చూచితివా?' అని యడిగెను. 'ఈమెకు సాటి స్త్రీని గాని పురుషునిఁ గాని కని యెఱుంగను. ప్రతిష్ఠానపురమందు పృథ్వీరూపమహా'రాజు ఈమెకు తగినరూపవంతుఁడు ఒక్కఁడు ఉన్నాఁడు. ఆయనతో ఈమెకు ఘటిల్లెనేని సొంపుగా నుండును. రాజ కన్య తుల్య రూప దొరకక ఆయన తరుణుఁ డయ్యును వివాహ మాడకయే యున్నాఁడు. లోక లోచనోత్సవ మయిన యారాజును చూచి నేను కుతూహలముచే ఆరూపమును పటములో వ్రాసి తెచ్చియున్నాను.' అని ముచ్చి వాక్రుచ్చి పటము చూపెను. ఆ రూపమును చూచి రాజు ఆశ్చర్యముచే తల యూఁచి యూఁచి, 'చిత్తరువునం దయినసు ఇతనిం జూచిన మేము ధన్యులము, ఎవరు అతనిని సాక్షాత్తుగా చూతురో వారికి నమస్కారము.' అనెను. తండ్రి పలికిన యీ మాటను వినియు ఆలేఖ్యమును కనియు ఉత్సుక యైన రూపలతకు మఱి యేమియు అగపడదు, వినఁబడదు. ఆమె కామమోహిత యగుట యెఱింగి రాజు కుమారిదత్తునితో 'నీ వ్రాఁతయందు పొరఁబాటు ఉండదు. నిశ్చయముగా ఆరాజు నాకొమారితకు తగిన రూపవంతుఁడే. కావున నీవు త్వరగా నా కొమారిత పటమును కొనిపోయి అతనికి చూపి నాయభిప్రాయము తెలుపుము. ఆయన కిష్టమేని తత్క్షణమే వచ్చి నాకన్యను వివాహమాడునుగాక.' అని వానిని