పృథ్వీ రూపరాజు కథ.
875
ప్రవేశించి రాజు హృదయమందుఁ గ్రుచ్చు కొనినవి. అంత నుత్సుకుఁడై రాజు తనచిత్రకరోత్తమునికి కుమారిదత్త నా మునికి ఆన తిచ్చెను: ఓయి, నారూపమును సరిగా పటమున వ్రాసి చేకొని ఈ భిక్షువులతో ముక్తిపురద్వీపమునకు పొమ్ము. అందు రూపధరమహారాజునకును అతని కొమరితకును యుక్తిగా దానిని చూపుము. ఆ రాజు ఆకుమారిని నాకు ఇచ్చునో చూడుము. ఆముగుదను చిత్రములో వ్రాసి యిటకు తెమ్ము.' ఇట్లాజ్ఞాపించి తన ప్రతిమను వ్రాయించి భిక్షువులతో ఆముచ్చిని ఆదీవికి పంపెను.
వారు మువ్వురును యథాక్రమముగా పోయి సముద్ర తీరమందు పత్త్రపుర మను నగరము చేరి ఓడ యెక్కి సాగర మార్గమున అయిదు దినములకు ముక్తిపుర ద్వీపము చేరిరి. అచట చిత్రకరుఁడు రాజద్వారమున 'నాకు సాటి ముచ్చి యీ లోకములో లేఁడు' అని పతాక యెత్తెను. దానిని విని రూపధరమహారాజు పిలిపింపఁగా, చిత్రకరుఁడు పోయి ప్రణమిల్లి విన్నవించెను.—“దేవా, నేను లోక మెల్ల భ్రమించితిని, నాకుసాటి చిత్రకారుని చూఁడ నైతిని. దేవాసురమనుజులలో ఎవనిని వ్రాయుదును? ఆన తిమ్ము.' రాజు రూపలతను రావించి ఆమె ప్రతిమను వ్రాయు మనెను. కుమారిదత్తుఁడు రాజకన్యను సరిగా వ్రాసి చూపెను. రూపధరుఁడు చూచి సంతోషించి ఆముచ్చిని వివేకిగా నూహించి వానివలన అల్లుని పొందఁ