రాముఁడు మరల సీతను గలయుట.
873
మార్గమున వచ్చి క్షత్త్రధర్మమున లవుని యుద్ధమునకు పిలిచి మోహనాస్త్రముచే మోహితుని చేసి కట్టి అయోథ్యానగరమునకు కొనిపోయెను. లవుఁడు రానందులకు వగచుచున్న సీతను ఓదార్చి, జ్ఞానదృష్టిచే వృత్త మెఱిఁగి, వాల్మీకి, కుశునితో 'నీయన్నను లవుని లక్ష్మణుఁడు కట్టి అయోధ్యకు కొనిపోయినాఁడు. ఈయస్త్రములచే అతనిని జయించి అన్నను విడిపింపుము.' అని దివ్యాస్త్రము లిచ్చి పంపెను. కుశుఁడు పోయి యజ్ఞభూమిని ఆక్రమించి దానిని కాచుటకై వచ్చిన లక్ష్మణుని ఆదివ్యమహాస్త్రములచే జయించెను. అంతట రాముఁడు యుద్ధమునకు వచ్చి వాల్మీకిప్రభావముచే ఆపిల్లవానిని జయింపనేరక 'అబ్బాయీ, ఏల యుద్ధము చేసెదవు? నీ వెవరవు?' అని యడిగెను. 'లక్ష్మణుఁడు నాయన్నను కట్టి తెచ్చినాఁడు. నేను ఆయనను విడిపింప వచ్చినాఁడను. మేము లవకుశలము, రామ తనయుల మని మాయమ్మ జానకి చెప్పినది.' అని తమవృత్తాంతమును చెప్పెను. అంతట రాముఁడు కన్నీళ్లు విడిచి లవుని తెప్పించి 'ఆపాపాత్ముఁడను రాముఁడను నేనే.' అని చెప్పుచు, వారి నిరువురను కంఠాలింగనము చేసెను. అంతట పౌరులు సీతాదేవిని పొగడుచు చూచుచుండఁగా రాముఁడు ఆ శిశువులను గ్రహించెను. సీతాదేవిని కూడ వాల్మీక్యాశ్రమమునుండి తెప్పించి రాజ్యభారము పుత్త్రులమీఁద మోపి ఆమెతో సుఖ