868
కథాసరిత్సాగరము. లం. 9. త. 1
విద్యచే నెఱిఁగి యిచటకి వచ్చితిని. ఆ విద్యవలననే నీవును ఇచటికి వచ్చితి వని ఎఱింగితిని. దేవతలు తెలిపిన యీ నా కన్యను స్వీకరింపుము. దీనితండ్రి చెప్పిన వివాహలగ్నము ఱేపు. ఇప్పటికి కౌశాంబికే పొమ్ము. మేమును ఇచటినుండి పోయెదము. ఱేపు దీనితండ్రి అలంకారశీలుఁడు తపోవనము నుండి వచ్చి దీనిని నీకు స్వయముగా ఇచ్చును.
ఇట్లు ఆమె పలుకఁగా అలంకారవతికిని నరవాహనదత్తునికిని ఇరువురకును అనిర్వచనీయ మైన దశావిశేషము కలిగెను. అపుడు సాయంకాలము ఆసన్న మై యుండఁగా చక్రవాకమిథునము వోలె రాత్రిమాత్రవిరహమును సహింప లేక యా యిరువురును బాష్పాకులిత నేత్రులు కాఁగా చూచి కాంచనప్రభ యిట్లనియె:- ఏమి ఒక రాత్రి యెడఁబాపునకే మీకు ఈ యధైర్యము? ధీరులు పారము లేని విరహమును చిరకాలము సహింతుకు, సీతారాములకథను వినుఁడు.
రాముఁడు సీతను విడనాడిన కథ.
తొల్లి అయోధ్యాధిపతి యైన దశరథుని కొమరుఁడు భరతశత్రుఘ్న లక్ష్మణుల యన్న శ్రీరాముఁడు ఉండెను. ఆయన రావణుని పరిమార్చుటకు అవతరించిన విష్ణువు. ఆయనకు జనకునికూఁతురు సీత భార్యయై ప్రాణప్రియయై యుండెను. తండ్రి విధియోగమున రాజ్యము భరతుని కిచ్చి ఇతనిని సీతా లక్ష్మణులతోఁ గూడ అడవికిఁ బంపెను. అచట రావణుఁడు