Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలంకారవతీలంబకము.

1 - వ తరంగము.

అలంకారవతి కథ.


క. పర్వతములును నిశుంభ న
   తోర్వీఖర్వితము లగుచు నొగి మ్రొక్కు గతిం
   బర్వెడు నే నర్తిల్లు సు
   పర్వుని, కా బొజ్జసామి పాలించు మమున్.


ఇట్లు నరవాహనదత్తుఁడు కౌశాంబిలో ఆదియందే విద్యాధరాధీశులచే నుతులు గొనుచు తండ్రియింట ఉండెను. ఒకనాఁడు గోముఖసహాయుఁ డై వేఁటకుఁ బోయి, సేనవెనుకఁ జిక్కఁగా, నొకమహారణ్యము ప్రవేశించెను. అతనికి కుడికన్ను అదరి శుభాగమమును చెప్పుచుండఁగా, దివ్యవీణారవమిశ్ర మైన గీతనిస్వనము వినఁబడెను. దాని ననుసరించి పోయి చెంగట నొక శివాలయమును స్వయముగా వెలసిన దానిని చూచి, గుఱ్ఱమును నిలిపి అందు ప్రవేశించెను. అచట దేవదేవునికి వీణాగానసేవ చేయుచున్న యొక దివ్యకన్యను అనేక వరకన్యా పరివృతను చూచెను. ప్రసరత్కాంతినిర్ఝర యైన యామె చంద్రమూర్తి సముద్రమునుంబోలే అతనిహృదయమును కలఁత