Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

860

కథాసరిత్సాగరము. లం. 8. త. 7

కొని తనసిద్ధిప్రభావముచే తత్క్షణమే ఆ ఋషభపర్వతములో వదలి అదృశ్యుఁ డాయెను. సూర్యప్రభుఁ డచట నుండఁగా, అతనిచెలికాండ్రు, కామచూడామణ్యాదిభార్యలు, విద్యాధరాధిపతులు, ఇంద్రాదిదేవతలు, మయాద్యసురులు, మహర్షులు, శ్రుతశర్మ, సుమేరువు, సువాసకుమారుఁడును వచ్చిరి. వారి సందఱను సూర్యప్రభుఁడు యథార్హముగా సమ్మానించెను. అతనివలన రుద్ర దర్శన వృత్తాంతమును విని వా రందఱును సంతల్లిరి.

అంతట నానామహౌషధీసహిత మయిన నదీ నద సాగరతీర్థ జలములను మణి కనక కుంభములలో ప్రభాసాదులు స్వయముగా తెచ్చిరి. అంతలో గౌరీసమేతుఁ డై మహేశ్వరుఁడును అచటికి వచ్చెను. ఆయనపాదములకు దేవాసుర విద్యాధర నృపతి మహర్షు లందఱును ప్రణమిల్లిరి. ఆ సురాసుర విద్యాధరులు పుణ్యాహఘోషము చేయుచుండఁగా మహర్షులు సూర్యప్రభుని సింహాసనమునఁ గూర్చుండఁబెట్టి విద్యాధరాధి రాజ్యమునకు అభిషేకము చేసిరి. సంతోషముతో విజ్ఞానమయుఁ డైన మయాసురుఁడు అతనికి పట్టమును మకుటమును కట్టెను. తూర్యములతో దేవదుందుభులు మ్రోఁగెను. దివియందు అచ్చరలు నృత్యము చేసిరి మహర్షి సమూహము ఆకామచూడామణిని కూడ అభిషేకము చేసి సూర్యప్రభునికి మహాదేవినిగా చేసెను. పిమ్మట, దేవాసురులు పోఁగా, సూర్య