సూర్యప్రభుని విద్యాధర రాజ్యాభిషేకము.
859
ద్వారములను అయిదింటిని దాఁటి, కొండపై ఒకస్ఫాటిక ద్వారమును కాంచెను. అచట దేవదేవుని స్తుతింపఁగా నొకరుద్రుఁడు తలుపు తీసి సాదరముగా ఇతనిని లోపలికి కొనిపోయెను. దివ్యగంధ వహద్వాతము సదాపుష్పఫల ద్రుమము గంధర్వారబ్ధ సంగీతము అప్సరోనృత్తరసోత్సవము నై స్వర్గాధిక మైన శంకరు నాలయమును సూర్యప్రభుఁడు చూచెను. అందు ఒకచోట పార్శ్వస్థిత యై గిరిజాదేవి సేవించుచుండ, స్ఫాటికసింహాసనాసీనుఁ డైన చంద్రార్ధశేఖరుని శూలపాణిని పింగజటాజూటుని స్వచ్ఛస్ఫటిక సన్నిభుని త్రిలోచనుని మహేశ్వరునిఁ గాంచి ఆనందసాగరమగ్నుఁడై సూర్యప్రభుఁడు సదేవీకుఁడయిన యా దేవుని పాదముల వ్రాలెను. మహేశ్వరుఁడు అతనిని వీఁపున చేయి పెట్టి లేపి కూర్చుండఁ బెట్టి 'ఏల వచ్చినాఁడ' వని యడిగెను. 'నాకు అభిషేకము సమీపించినది, ప్రభువుయొక్క సన్ని ధానమును వేఁడ వచ్చితిని. అని సూర్యప్రభుఁడు విన్నవించుకొనెను. 'పుత్త్రా, నాసన్నిధానముకై ఇంత శ్రమపడితి వేల? అచటనే స్మరించిన రానా? కానిమ్ము వచ్చెదను.' అని భక్తవత్సలుఁడు పలికి చెంత నున్న ప్రమథు నొకనిం బిలిచి, లెమ్ము. ఇతనిని అభిషేకార్థము ఋషభపర్వతమునకు కొనిపొమ్ము. అది యీచక్రవర్తులకు మహాభిషేకస్థానము గదా.' అని యాజ్ఞాపించెను. అంత నాగణోత్తముఁడు కృత శివ ప్రదక్షిణుని సూర్యప్రభుని ప్రణతుఁ డై ఒడిలో కూర్చుండఁబెట్టు