సూర్యప్రభుని కథ.
723
వచ్చిన యధావిధిగా తాను అల్లుని సత్కరించునట్లును, రాని యెడల సుతాస్నేహముచే ప్రాణములు వదలునట్లును, చెప్పినాఁడు. నేను నీతో ఇపుడు చెప్పితిని.' వెంటనే చంద్రప్రభుఁడు 'కాంతిమతిని కాంతిసేనునియొద్దకు చేర్పుము, మేమును అచటికే వచ్చెదము.' అని ప్రహస్తుని కాజ్ఞాపించెను. ప్రహస్తుఁడును అట్లే చేసెను. తెల్లవాఱఁగానే కుంభీరమహారాజు కూడ రాఁగా అందఱును విమాన మెక్కి ఆకాశమార్గమున శ్రీకంఠదేశమునకు పోయిరి. కాంతిసేనమహారాజు వీరికి ఎదురు వచ్చి యింటికి తోడ్కొనిపోయి యథావిధిగా కొమార్త వివాహము జరిపెను. కాంతిమతికిని సూర్యప్రభునికిని ఆతఁ డిచ్చిన బంగారపురాసులు చూచి ఆ రాజు లెల్ల ఆశ్చర్యపడిరి.
వా రందఱును అచటనే నానాభోగములలో నుండఁగా కౌశాంబినుండి దూత వచ్చి యిట్లనియె: — "జనమేజయ మహారాజు మీతో చెప్పు మన్న మాట: - 'ఎవఁడో ఇప్పుడే నాసుతను పరపుష్ట యనుదానిని హరించినాఁడు. పరపుష్ట సూర్యప్రభుని చేతిలో చిక్కియున్న దని ఇట మాకు తెలిసినది. ఆమెను తోడ్కొని అతఁడు మాయింటికి నిశ్శంకముగా వచ్చునుగాక, సత్కరించి సభార్యునిఁగా పంపెదను. రానియెడల మీకు మేము మాకు మీరు శత్రువులమే.' అని " ఇట్లు పలికీ దూత విరమింపఁగా చంద్రప్రభుఁడు రాజు లందఱతోను ఏకాంతములో 'ఇంత గర్వముగా పలుకుచున్న యతనియింటికి పోవచ్చునా?'