858
కథాసరిత్సాగరము. లం. 8. త. 7
దేవుఁడు నీకు ప్రసన్నుఁ డయినాఁడు?' అనెను. సూర్యప్రభుఁడు ఆశ్చర్యపడి లోపలికిఁ బోయెను. అచట అతి విశాల జ్యోతీరస శిలాతలమందు పన్నిద్దఱు సూర్యుల ప్రభతో వెలుంగుచు కూర్చుండి యున్న యొంటికోఱయేనుఁగుమోము బొజ్జదేవరను నానాజంతువుల మోములుగల ప్రమథులచే కొలువందుచున్న వానిని చూచి పాదముల వ్రాలెను. విఘ్న రాజు ప్రీతుం డై యతనిని వచ్చిన కారణ మడిగి తెలిసికొని 'ఈ దారిని ఎక్కిపొమ్ము.' అని దయతో చెప్పెను. సూర్యప్రభుఁడు ఆదారిని అయిదు యోజనములు ఎక్కి ఒకగొప్ప పద్మరాగద్వారమును గాంచెను. లోపలికి ప్రవేశము లభింపక పినాకిని నామ సహస్రముతో అనన్యమానసుఁ డై స్తుతించెను. అంతట కుమారకుమారుఁడు విశాఖుఁడు స్వయముగా ఆ ద్వారమును తెఱచి, తన్ను తెలియఁ జెప్పి, సూర్యప్రభుని లోపలికి రమ్మని, కొనిపోయెను. అచట శాఖవిశాఖాది పరస్పర సదృశ సుత పంచక పరియుక్తుండై జాతమాత్రభాధకము లయిన దుష్టగ్రహ శిశు గ్రహములచేతను చరణానతు లయిన కోటిమంది గణేశుల చేతను వేష్టితుఁ డై యున్న జ్వలదనల సమప్రభుని స్కందుని దర్శించెను. ఆశరవణభవదేవుండును తుష్టుఁ డై సూర్యప్రభుని వచ్చి కారణ మడిగి ఆపైమార్గము చూపించెను.
ఈ క్రమమున సూర్యప్రభుఁడు సానుచరులగు భైరవ మహాకాళ వీర భద్ర నందులచే విరుద్ధము లయిన కడమ రత్న