Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూర్యప్రభుని విద్యాధర రాజ్యాభిషేకము.

857

“దేవా, త్రికూట నా థాది విద్యాధ రేశ్వరు లెల్ల నన్ను నీ యొద్దకు పంపినారు. వారి విన్నపము నవధరింపుము: 'నేఁటికి మూఁడవనాఁడు ఋషభాద్రిలో నీకు అభిషేకము శుభము. అందులకు ఉద్యమ మారంభింపుము.' అని." అందులకు సూర్యప్రభుఁడు "మీరే ఎల్ల సరంజామును చేయుఁడు. మేము మామాత్రముగానే సిద్ధముగా నున్నాము. అందఱకు ఉచితముగా సంవాదనము చేసెదము ' అని మామాటగా వారితో చెప్పుము.” అనెను ఆయాజ్ఞను గ్రహించి సుషేణుఁడు చనెను. సూర్యప్రభుఁడును ఒక్కొకరిని దేవతలను యాజ్ఞవల్క్యాదులను రాజులను విద్యాధరులను తనయభిషేక మహోత్సవమునకై పిలుచుటకు ప్రభాసాది మిత్త్రులను పంపెను.

సూర్యప్రభుని విద్యాధర రాజ్యాభిషేకము.

పిమ్మట పర్వతోత్తమ మైన కైలాసమునకు ఏకాకిగా అంబికాగిరీశులను స్వయముగా పిలిచి రాఁ బోయెను. శుభ్ర భూతధవళ మై దేవర్షిసిద్ధసేవ్యం బై శంకరునింబోలి రాజిల్లుచున్న యాకైలాసగిరిని సూర్యప్రభుఁడు దర్శించి, సగమునకు ఎక్కువ యెక్కి అటుపయి నెక్క లేక నలుదిక్కులు చూడఁగా, అచట పగడపు ద్వార మొకటి యగపడెను. సిద్ధిమంతుఁ డయ్యు అందు ప్రవేశము అసాధ్యము కాఁగా, ఏకాగ్రచిత్తుఁ డయి చంద్రశేఖరుని స్తుతింపసాగెను. అంతట గజముఖుఁ డైన యొక పురుషుఁడు ఆద్వారమును తెఱచి 'రమ్ము లోపలికి. హేరంబ