856
కథాసరిత్సాగరము. లం. 8. త. 7
ఇట్లు దేవాదులను సమ్మానించి నందిప్రభృతి గణేశ్వరు లందఱును తమయిచ్చను బోయిరి. అంతట దేవాసురు లందఱును వారితల్లులును పోయిరి. శ్రుతశర్మాదులును సెలవు పుచ్చుకొని తమతమ ధామములకుఁ బోయిరి. సూర్యప్రభుఁడు భార్యలతోను మిత్త్రులతోను పెండ్లికొమారితతోను విమాన మెక్కి ఆ మొదటి సుమేరు తపోవనమునకుఁ బోయెను. రాజులకును రత్నప్రభునికిని తన యభ్యుదయము చెప్పు మని తనమిత్త్రుని హర్షుని పంపెను.
రాత్రి మణిమయ పర్యం కాలంకృత మైన వాసగృహమును కామచూడామణీ సహాయుఁ డై ప్రవేశించెను. అందు ఆనవవధూమణిని బిగికౌఁగిటంగ్రుచ్చి కెమ్మోవియాని లజ్జవాపి అన్యలవలన లభింపనివి యనాస్వాదితపూర్వము లయిన రతోత్సవంబులం దేలెను. 'ఇఁకను ఇతరులు నాహృదయమునకు బైటనే ఉందురుగాక, నీవుమాత్రము నాహృదయమున లోపల నుందువు గాక.' అని పలికి సూర్యప్రభుఁడు ఆమెను రంజించెను. రతాంతసుప్తుని కాతనికి ప్రియాశ్లేష సుఖానహ లయిన నిశా నిద్రలు సమాప్తి నొందినవి. తెల్లవాఱఁగానే పోయి సూర్యప్రభుఁడు ఒక చోఁ గలసి యున్న తన తొలిభార్యల నందఱను రంజించెను. వారు నవవధూరక్తుని అతనిని పరిహసించుచుండఁగా, దౌవారిక నివేదితుఁ డై సుషేణుఁ డను విద్యాధరేశ్వరుఁడు వచ్చి ప్రణమిల్లి సూరప్రభునికి విన్నవించెను.