Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కామచూడామణీ వివాహము.

853

కె ట్లిచ్చును? ప్రబలుఁడు తన దేహమును ఈసురల కెట్లు ఇచ్చును ? హరికి మూఁడులోకములు ఇచ్చి ఈబలి కారాగృహ మేల ప్రవేశించును? అయోదేహుఁడు తనదేహమును విశ్వకర్మ కెట్లిచ్చును? ఇంక నిదర్శనములు కావలయు నేని ఎన్ని చెప్పుదును? ఇట్లు నిత్యము గౌరవించుచుండునసురులను సురలు మిషచే బాధింపరేని విరోధ మెక్కడిది?' అనెను. అందులకు సిద్ధి చెప్పిన మంచిబోధనలచే దేవాసురులు అన్యోన్యమిత్త్రులై కంఠాలింగనములు చేసికొనిరి.

కామచూడామణీ వివాహము.

అంతలో భవానిప్రతీహారి జయ వచ్చి పూజిత యై సుమేరువుతో ననియె: - 'నన్ను దేవి పంపినది; ఆమె నీ కిట్లు ఆజ్ఞాపించుచున్నది. 'నీకు కామచూడామణి యని కన్య యున్నది గదా, దానిని నాభక్తురాలిని శీఘ్రముగా సూర్యప్రభునికి ఇమ్ము.' సుమేరువు వినీతుఁ డై పలికెను. - 'దేవియాజ్ఞ నాపై పరమానుగ్రహము గదా? దేవుఁడు కూడ ఈ విషయమునే పూర్వము నా కాజ్ఞాపించి యున్నాఁడు.' జయ సూర్యప్రభునితో 'నీ యందఱు భార్యలలోను ఈమెను నీవు ఎక్కువగా చూచుకొనవలసినది. ఈమె కడమయందఱుభార్యలకంటె నీకు ప్రియతర యగును. ఇట్లనియు దేవి నీకు ప్రసన్నయై ఆజ్ఞ యనుగ్రహించినది.' ఇట్లు పలికి జయ సూర్యప్రభునిచే పూజిత యై యదృశ్యురా లాయెను. ఆ దినమే సుమేరువు శుభలగ్నము