852
కథాసరిత్సాగరము. లం. 8. త. 7
ఏడుపాతాళముల యెకిమీలు ప్రహ్లాదప్రభృతి దైత్యదానవేంద్రులు అందఱును సంతసమున వచ్చిరి. ఇంద్రుఁడు లోకపాలాదిసమేతుఁ డై గురువును మున్నిడుకొని వచ్చెను. విద్యాధరేశ్వరుఁడు సుమేరువు సువాసకుమారాన్వితుఁ డై వచ్చెను. దన్వాదికశ్యపభార్య లెల్లరును వచ్చిరి. భూతాసనవిమానమెక్కి సూర్యప్రభుని భార్యలందఱును వచ్చిరి. వీరందఱును కృతపరస్పరప్రీత్యుచితాచారు లై కూర్చుండఁగా దనుదేవి సఖి సిద్ధి యనునది ఆమెయాజ్ఞచే నిట్లనియె: 'ఓసురాసురులారా, దనుదేవి మిమ్ము ఇట్టులు బోధించుచున్నది. ఈ ప్రీతిసమాజమందు మీకు ఏతృప్తియు సుఖమును కలిగినవో అవి యెన్నఁ డైనను అనుభవించి యుంటిరా? కనుక దుఃఖదారుణ మయిన యన్యోన్యవిరోధమును మీరు పెట్టుకొనకుఁడు. స్వర్గాధిపత్యముకై విరోధమును ఎవరు చేసిరో ఆ హిరణ్యాదులు పోయినారు. ఇప్పుడు శక్రుఁడే పెద్దవాఁడు, విరోధ మే మున్నది? కనుక పరస్పరము నిర్వైరముగా సుఖముగా నుండుఁడు. అందువలన మాకు సంతోషము లోకములకు క్షేమమును కలుగును.' ఇట్లు సిద్ధిముఖముగా విని శక్రుఁడు తనమొగము చూడఁగా, బృహస్పతి దానికి 'ఈ యసురులు నిర్నిమిత్తముగా దేవతల పై కలుషింపరేని దేవతలకు అసురులపై ద్వేషము ఉండదు.' అని పలికెను. అందులకు మయుఁడు 'అసురులు కలుషించు వారేని నముచి మృతసంజీవన మైన యుచ్చైశ్శ్రవమును ఇంద్రుని