సూర్యప్రభుని కథ.
721
దానిని విని చంద్రప్రభుఁడు వీరభటుని హెచ్చరికమీఁద ప్రహస్తుని పిలిచి "నీవే పోయి రంభునితో మామాటగా 'ఏల చింతిల్లెదవు ? నీయల్లుని శంకరుఁడు విద్యాధరచక్రవర్తిగా నిర్ణయించి యున్నాఁడు. అతనికి ఈకన్యలు భార్య లగుదురని సిద్ధులు ముందే పలికియున్నారు. నీకొమారిత తనచోటు చేరినది. కర్కశుఁడవు గావున నిన్ను ప్రాథింప లేదు. నీవు మాకు సఖుఁడవు. సంతోషింపుము, మేము అచటికి వచ్చెదము.' అని చెప్పుము.” అని పలుకఁగా అతఁడు జాముసేపులో వజ్రసారపురమునకు పోయి రంభునికి ఆ వార్త చెప్పి అతని యంగీకారమును గొని చంద్రప్రభునియొద్దకు వచ్చి ఆవృత్తాంతమును తెలిపెను. చంద్రప్రభుఁడు ప్రభాసుఁ డనుమంత్రిని పంపి అతనిచే శాకలమునుండి రంభునికూఁతును తారావళిని తెప్పించెను. సూర్యప్రభునితోను వీరభటాదులతోను కూడుకొని విమాన మెక్కి చంద్రప్రభుఁడు వజ్రసారమునకు పోయెను. తనరాకను జనులెల్ల నెదురు సూచు చుండ, రంభుఁడు ఎదురు వచ్చి తోడ్కొని పోఁగా, చంద్రప్రభుఁడు రాజమందిరమునకు పోయెను అచట రంభుఁడు వివాహోత్సవము జరిపి కొమారితకు లెక్క లేని సువర్ణ గజాశ్వ రత్నాదికము నిచ్చెను. అల్లునికి గొప్ప సత్కారములు చేసి సొంతభోగములను మఱపించెను.
వా రందఱు అచటనే ఉత్సవముగా సుఖ ముండఁగా కాంచీనగరినుండి రంభునియొద్దకు దూత వచ్చెను. అతని సం