Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుణశర్మ కథ.

837

దత్తుఁడు ఈగ్రామము నా యగ్రహారము. ఇందు సుఖముగా నుండుము.' అని పలికి, అతనిని సర్వసమృద్ధి గల దై ఆవులు గేదెలు గుఱ్ఱములును ఒప్పుచున్న తన యింటికి తోడ్కొనిపోయి స్నా నాంగరాగ వస్త్రాభరణ వివిధ భోజనములతో సత్కరించెను. దేవతలు గూడ కామింపఁ దగిన రూపవతిని సుందరి యను తనకన్యను లక్షణములు చూపుమిషచేత గుణశర్మకు చూపెను. అనన్య సామాన్య రూపను ఆ కన్యామణిని చూచి గుణశర్మ అగ్నిదత్తునితో, 'ఈమెకు సవతులు ఉందురు. నాసికయందు ఈమెకు మచ్చ యున్నది, దానిని బట్టి చెప్పితిని. వక్షమునను రెండవ మచ్చ యున్నది. వానిఫల మిది.' అని చెప్పెను. అంతట ఆమెయన్న తండ్రి యానతిచే ఆమెవక్షంబున, పైఁట యెత్తిచూడఁగా, మచ్చ అగపడెను. అంతట నగ్నిదత్తుఁడు ఆశ్చర్యపడి గుణశర్మతో 'అయ్యా, నీవు సర్వజ్ఞుఁడవు ; ఈమె తిలకములు అశుభములు కావు. సాధారణముగా లోకములో భర్త శ్రీమంతుఁ డేని సవతు లుందురు. దరిద్రుఁడు ఒకతెనే పోషింప లేఁడు. పెక్కండ్ర నెట్టు పోషించును ?' అనెను. గుణశర్మ ఆమాట విని 'అవు నయ్యా, నీవు చెప్పినది సరియే. సులక్షణ మయిన యీయాకృతికి అశుభ మెక్కడిది?' అని బదులు చెప్పెను.

ఆ ప్రసంగమున అగ్నిదత్తుఁ డడుగఁగా గుణశర్మ స్త్రీ పురుషులకు ప్రత్యవయవమందును తిలకాదుల ఫలమును వేఱు