Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుణశర్మ కథ.

827

తరువాత కొన్నిదినములకు ఆరాజు బలయుక్తుఁ డై తన వైరి యైన విక్రమశక్తి మీఁదికి దాడి వెడలెను. అతఁడును ఇతనితో పోరుటకై తననగరు వెలువడి వచ్చెను. ఉభయులకును ఘోరసంగ్రామము ప్రారంభ మాయెను. రాజు లిద్దఱును క్రమముగా ద్వంద్వయుద్ధ మారంభించి విరథీకృతు లై ఒండొరువులను కత్తిదూసికొని పైకొనుచుండఁగా ఆతొట్రుపాటుచే మహాసేనుఁడు నేల పడెను. పడిన యతనిని కత్తిం బొడుచుచున్న విక్రమశక్తిని గుణశర్మ చక్రాయుధముతో భుజమును ఖండించి పరిఘముతో వక్షమునఁ గొట్టి నేలం గూల్చెను మహాసేనమహారాజు లేచి సంతోషించి 'ఏమి చెప్పుదును మహావీరుఁడా, ఈ ప్రాణములు నీ విపుడు అయిదవమాఱు నా కిచ్చినవి.' అని గుణశర్మను మాటి మాటికి పొగడుచుండెను. ఇట్లు గుణశర్మచే నిహతుఁ డయిన విక్రమశక్తి యొక్క సైన్యమును రాష్ట్రమును మహాసేనుఁడు ఆక్రమించెను. గుణశర్మయొక్క తోడ్పాటుచే ఇతరరాజులను కూడ జయించి ఉజ్జయినికి వచ్చి సుఖముండెను.

అశోకవతియు గుణశర్మకై ఉవ్విళు లూరుచుండి, వచ్చిన పిమ్మట నతనిని రేయుంబగులు ప్రార్థించుచుండెను. ఆ యకార్యమునకు అతం డెట్లును ఒప్పఁ డాయెను. సజ్జనులు దేహమునైన వదలుదురు గాని అవినయ మాచరింపరు. అశోకవతి అతని నిశ్చయము నెఱింగిన దై కపటదుఃఖమును నటించుచు ఏడ్పు