Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుణశర్మ కథ.

825

యిట్లు నిర్బంధించుటఁ గని ఆసమయమునకు తప్పించుకొనువాఁడై గుణశర్మ యుక్తిగా 'దేవీ, ఇంత నిర్బంధమేని నీమాట నెఱవేర్చెదను. అయినను రహస్యము బయటఁ బడు నని భయ మగుచున్నది. కనుక అవసరపడఁ దగదు. కొలఁదిదినములు ఓర్వుము. నామాట నమ్ముము. సర్వనాశము చేయునది యైన నీ విరోధము నా కేల?' అని ఆమెను ఆశ గొల్పి ఒప్పించి అచటి నుండి వెలువడి ఊఱడిల్లి యింటికి పోయెను

పిమ్మట మహాసేనరాజు సోమకేశ్వరుని కోటలో ముట్టడించెను. గౌడనాథుఁడు విక్రమశక్తి వచ్చి మహాసేనుని ముట్టడించెను. అంతట మహాసేనుఁడు గుణశర్మతో 'ఒకనిని ముట్టడించి యున్న మనము మఱియొకనిచే ముట్టడి నొందితిమి. ఇప్పుడు ఇద్దఱతో పోర మన మెట్లు చాలుదుము? యుద్ధము చేయక ముట్టడిలో ఎంతకాల ముందుము ? సంకటము వచ్చినది. ఏమి యుపాయము?' అని యడుగఁగా ' దేవా, ఉపాయము చేసెదను, ధైర్యముగా నుండుము. ఆ యుపాయమున ఈ సంకటము తప్పించు కొనుటయే గాక కార్యమును కూడ సాధించెదను. అని ఉత్సాహపఱిచి గుణశర్మ కన్నులకు అంతర్ధానాంజనము పెట్టుకొని రాత్రి విక్రమశక్తియొక్క స్కంథావారమునకుఁ బోయి నిద్రితుఁ డయి యున్న విక్రమశక్తిని లేపి 'రాజా, వినుము, నేను దేవదూతను, ఈ క్షణమే మహాసేనరాజుతో సంధి చేసికొని వెడలి పొమ్ము. అటు చేయ