గుణశర్మ కథ.
823
రాజు ఆవంటవానిచేతనే ఆకూర తినిపించెను. వాఁడును వెంటనే మూర్ఛితుఁ డాయెను. గుణశర్మ మంత్రములచే వానివిషదోషమును పోఁగొట్టఁగా రా జడుగఁగా సూపకారుఁడు ఉన్న మాట ఉన్నట్టు ఇట్లు చెప్పెను: 'దేవా, నన్ను మీవైరి గౌడరాజు మీకు విషము పెట్టు మని యిచటికిఁ బంపినాఁడు. నేను పరదేశిని వంటనేర్పరిని అయి, నన్ను ఏలినవారికి తెలుపుకొని బానసంబున కొలువు కుదిరితిని. ఇప్పుడు కూరలో విషము పొదిగి తమకు పెట్టు చుండఁగా ఈ మహాత్ముఁడు కనిపట్టినాఁడు. పైసంగతి తమకే విశదము.' ఇట్లు పలికిన యా సూదుని దండించి రాజు ప్రాణదాతయైన గుణశర్మకు ప్రీతితో వేయి గ్రామములు ఇచ్చెను.
మఱునాఁడు మరల రాణి నిర్బంధము చేయఁగా రాజు గుణశర్మచే వీణావాదనశిక్షను ఆరంభింపించెను. గుణశర్మ వీణ నేర్పుచుండఁగా అశోకవతి సదా విలాసహాసాదులు కావించుచుండెను. ఒకనాఁడు ఆమె మదనాతుర యై ఏకాంతమున అతనిని మాటిమాటికి గోళ్లతోఁ బొడుచుచుండెను. వారించుచున్న యా ధీరునితో 'ఓయిచెలువుఁడా, వీణావాదనమిషచే సుందరుని నిన్ను నేను కవయఁ గోరితిని. నీపై పట్టరాని మోహమున బడలు చున్న దాన, నన్ను నీవు స్వీకరింపుము.” అని వేడుకొనెను. 'ఇట్లు చెప్పకు. నాకు నీవు ప్రభుభార్యవు. నాబోఁటిఁవాడు ప్రభుద్రోహము చేయఁడు. ఈసాహసము