822
కథాసరిత్సాగరము. లం. 8. త. 6
గలవానినిగా తలంచి స్తుతించి బహుమానించెను.
రాణి అశోకవతి అతని యసదృశరూపమును ఆగుణములను చూచి అతనిపై మరులుకొని 'ఇతనిని పొందనయేని నా జీవిత మేల?' అని యాలోచించి యుక్తి పన్ని రాజుతో ననియె. 'ఆర్యపుత్త్రా, దయచేసి గుణశర్మను నాకు వీణావాదనము నేర్పు మని యాజ్ఞాపింపుము. ఇతని యీవీణావాదనకౌశలమును చూడఁగా నాకును ఆ కళయందు ప్రాణాధికప్రియ మయిన కుతూహలము పొడముచున్నది.' ఆప్రార్థన విని రాజు గుణశర్మను దేవికి వీణావాదనము నేరుపు మని నియమించెను. 'తమయాజ్ఞ, మంచిదినము చూచికొని ఆరంభించెను.' అని గుణశర్మ సెలవు పుచ్చుకొని యింటికి పోయెను. రాణిదృష్టి వేఱువిధముగా నుండుటం గనిపట్టి శంకించి అనేకదినములు వీణారంభము చేయకయే కాలము గడుపుచుండెను
ఒకనాఁడు మహాసేనరాజు భోజనము చేయుచుండఁగా చెంత నున్న గుణశర్మ కూర వడ్డించుచున్న వంటవానిని 'వలదు వల' దని నివారించెను. ఏ మని రా జడుగఁగా సర్వజ్ఞుఁడు ఆ గుణశర్మ 'దేవా, యీకూరలో విష మున్నది. లక్షణముల చేత నాకు తెలిసినది. వీఁడు దీనిని వడ్డించునపుడు భయముచే వణఁకుచు బెదరుచూపుల నాముఖమును చూచినాఁడు. ఎవరికైన దీనిని పెట్టినయెడల ఇప్పుడే ఈవిషయము బయ ల్పడును. నేను ఆవిషదోషమును పోఁగొట్టెదను.' అని పలికెను. అంతట