Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుణశర్మ కథ.

821

ఆడుచుండిరి. దానిచివర రాజు గుణశర్మచేతికి వీణ యిచ్చి వాయింపు మనెను. గుణశర్మ పారణను మీటి రాజుతో 'దేవా, ఈవీణ పనికి రాదు, మఱి యొకటి తెప్పింపుము, దీని యీ తంత్రిలో కుక్కవెండ్రుక ఉన్నది. తంత్రీఝంకార లక్షణముల చేత దీనిని నే నెఱుఁగుదును' అని పలికి ఆవీణను తొడమీఁది నుండి తొలఁగఁబెట్టెను. అంతట రాజు ఆతంతిని తడిపి విప్పి చూడఁగా దానికడుపునుండి కుక్క వెండ్రుక బయట వచ్చినది. అందులకు ఆశ్చర్యపడుచు అతని సర్వజ్ఞతను కొనియాడుచు రాజు మరియొకవీణను తెప్పించెను. విప్రుడు త్రిమార్గగయు ఓఘసుభగయు కర్ణపావన నిస్వనయు నై గంగనుంబోని యా వీణను వాయించుచు పాడెను. ఆశ్చర్యమగ్ను లయిన రాజునకును రాణికిని అతఁడు పిమ్మట వరుసగా శస్త్రాస్త్రవిద్యాకౌశలమును గూడ చూపెను. రాజు అతనిని 'బాహుయుధ్ధ మెఱుఁగుదువేని చేత ఆయుధము లేక ఒకబంధకరణమును చూపుము.' అని యడిగెను. 'దేవా, శస్త్రములు చేతఁ బూనుము, నన్ను వరుసగా కొట్టుము. చూపెదను బంధకరణమును.' అని గుణశర్మ చెప్పెను. పిమ్మట రాజు ఏయే ఖడ్గాద్యాయుధములను కైకొని ప్రహరించుచుండెనో వాని నెల్ల బంధకరణముచే అపహరించి యపహరించి గుణశర్మ తాను గాయపడక రాజుయొక్క చేతిని దేహమును కట్టివైచెను. అంత రాజు సర్వాతిశాయి యైన యాద్విజోత్తముని తనకు రాజ్యనిర్వాహమందు తోడ్పడఁ