820
కథాసరిత్సాగరము. లం. 8. త. 6
యను దేవి యుండెను. ఆమెతోఁగూడ రాజ్య మేలుచున్న యామహాసేనరాజునొద్ద గుణశర్మ యను నొక బ్రాహ్మణుఁడు మాన్యుఁడు ఉండెను. అతఁడు శూరుఁడు, అతిసుందరుఁడు, వేదవిద్యాపారంగతుఁడు, యౌవనవంతుఁడు, కళాశస్త్రాస్త్ర విదుఁడు, ఆరాజును ఎప్పుడును గొలుచుచుండెను. ఒకనాఁడు అంతఃపురమందు నృత్తప్రస్తావమున రాజును రాణియు ప్రక్కనున్న గుణశర్మతో 'నీవు సర్వజ్ఞుఁడవు, మాకు కుతూహలముగా నున్నది, నర్తింపనేర్తువేని దయచేసి మాకు నీకౌశలము చూపుము.' అనిరి. గుణశర్మ నవ్వుచు 'నేర్తునుగాని, ఆనృత్తము సభకు పనికి రాదు, అది, ప్రాయికముగా నవ్వు పుట్టించునట్టి మూఢనృత్తముగా శాస్త్రనిందితముగా నుండును. అందుసు రాజునెదుటను రాణియెదుటను! సీ! ఎంత లజ్జ!' అనెను. రాణి కుతూహలముచే ప్రేరింపఁగా రాజు 'ఇది రంగభూమియందలి నృత్తము గాదు, అది పురుషునికి లజ్జాకరము గాని ఇది గాదు, ఇది ఏకాంతముందు మిత్త్రగోష్ఠిలో తననేర్పును చూపుట. నేను నీకు రాజను గాను, నీవు స్వతంత్రుఁడవు, నా చెలికాఁడవు, నీ నృత్త కౌతుకము చూడక నేఁడు నేను భుజింపను.' అనెను. ఇట్లు రాజు పట్టు పట్టఁగా ఆ బ్రాహ్మణుఁడు అంగీకరించెను. కింకపట్టువాఁ డయిన దొరమాటను భృత్యులు ఎట్లు మీఱఁగలరు? అంతట ఆపడుచువాఁడు గుణశర్మ అవయవములతో నాడిన దెల్ల రసావేశముచేత రాజును రాణియు మనస్సులో