సూర్యప్రభుని కథ.
719
మీకు స్నేహము కలదేని ఇట రండు, వివాహాచారసఖ్యము చేయుదము గాక.' అని దూత్యము పంపెను. చంద్రప్రభుఁడు ఆదూత్యము విని, దూతను సత్కరించి మఱునాఁడే అచటికి పోవుటకు నిశ్చయము చేసికొనెను. వీరభటమహారాజుయొక్క సత్యము నిశ్చయించుకొనుటకై చంద్రప్రభుఁడు, దూతపోయి వచ్చుటకు విలంబ మగు నని ప్రహస్తమంత్రిని పోయి రమ్మని పంపెను. ప్రహస్తుఁడు త్వరగా పోయి వీరభటుని దర్శించి అతని కార్యము నడిగి అతనివలన సత్కారములు పడసి, ఆశ్చర్యపడుచున్న యతనితో 'ఱేపు మాప్రభువులు వత్తురు ' అని చెప్పి, గంటసేపులో మరల శాకలపురమునకు పోయి తన ప్రభువుతో వీరభటుఁడు సిద్ధపడి యుండుటను చెప్పి, యతనివలన గౌరవము వడసెను.
అంతట చంద్రప్రభుఁడు కీతిన్‌మతీదేవితోసు, సూర్యప్రభుఁడు విలాసినీ మదనసేనలతోను, భూతాసనవిమాన మెక్కి అమాత్యపరివారసమేతముగా ప్రాతఃకాలమున బయలువెడలి జాముప్రొ ద్దెక్కు_నప్పటికి తామ్రలిప్తికి పోయి, కన్ను లెత్తి చూచుచున్న యచటికి జనులందఱకు ఆశ్చర్య మొదవించుచు, ఆకసమునుండి దిగిరి. వీరభటమహారాజు ఎదురువోయి సత్కరించి వారిని నగరికి తోడ్కొని పోయెను. పురమెల్ల అలంకృతమై యుండెను. అడుగడుగునను వీథులలో మంచిగందము కలయంపి చల్లిరి. పౌరస్త్రీల కటాక్షములు నల్లగలువతో రణములు