Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

818

కథాసరిత్సాగరము. లం. 8. త. 5

అని పలుకుచున్న తేజఃప్రభుని మాశక్తిచే స్తంభింపఁజేసి, ఆమెను తెచ్చి మహాకాలప్రభువునొద్ద సమర్పించితిమి. ఆయన ఆమెను స్వజనమునకు ఒప్పగించెను. ఈ యద్భుతమును చూచితిని. అంతట అచట కొన్ని దినము లుండి దేవునికి నమస్కరించి యిచటికి వచ్చితిని.” ఆమె ఇట్లు చెప్పఁగా 'ఎవఁడు విద్యాధర చక్రవర్తి యగును? నీవు సర్వమును ఎఱుఁగుదువు గదా చెప్పుము.' అని మేము అడిగితిమి. 'సూర్యప్రభుఁడు అగును.' అని ఆమె పలుకఁగా, ఈసింహబలుఁడు మాతో ననియె. - 'ఇది యసత్యము. దేవతలు ఇంద్రునితోఁ గూడ శ్రుతశర్మపక్షమున నడుము కట్టుకొని యున్నారు.' ఆమాటకు ఆమె మా యిరువురతో అనియె —'త్వరలోనే సూర్యప్రభునికి శ్రుతశర్మకును యుద్ధ మగును, అందులో మీరు చూచుచుండఁగా నే యీ సింహబలుఁడు మనుష్యునిచే మడియును; ఆతార్కాణమును చూచి నా యీమాట సత్య మని యెఱుఁగుదురు.' ఇట్లు చెప్పి ఆయోగిని పోయెను. ఆదినములు పోయినవి. ఇప్పుడు ప్రత్యక్షముగా చూచితిమి; ఏమనఁగా, మర్త్యునిచే సింహబలుఁడు మృతిఁ బొందుట, ఆనమ్మకముచే నీవే సర్వవిద్యాధరచక్రవర్తి వని నిశ్చయించుకొని మేము నీపాదసరోజయుగ్మము నాశ్రయించి నీశాసనములో నున్నారము.

ఇట్లు ఆమహాయాన సుమాయకులు పలుకఁగా సూర్యప్రభుఁడు మయాదిసమేతుఁడై నమ్మి యథార్థముగా సమ్మతిం