ప్రభాసుని యుద్ధము.
817
సూర్యప్రభుని దర్శించి ప్రణమిల్లి యి ట్లనిరి. - దేవా, మేము మహాయాన సుమాయు లనువారము ఇద్దఱమును, మూఁడవవాఁడు సింహబలుఁడును, మహాశ్మశానాధిపతిత్వ సిద్ధులము. ఇతర విద్యాధరేంద్రులకు అధర్ష ణీయులము. మేము శ్మశానములో సుఖముగా కూర్చుండి యుండఁగా మాయొద్దకు ఒకనాఁడు శరభానన యని సదా ప్రసన్ను రాలును దివ్యమహాప్రభావయు నైన యోగిని వచ్చెను. 'నీ వెక్కడ నుంటివి? ఏమి విశేషము అచట చూచితివి? చెప్పుము భగవతీ.' అని మేము ప్రణమిల్లి యడుగఁగా, ఆమె యిట్లు చెప్పెనది - “నాప్రభువును మహాకాలదేవుని చూచుటకు యోగినులతోఁ గూడ పోయి యుంటిని. అచట బేతాళపతి యొకఁడు నేను చూచుచుండఁగా దేవునితో నిట్లు విన్నపించెను - 'దేవా, విద్యాధరేశులచేత మడిసిన మామహాసైన్యపతి యగ్నికుని కొమారితను మహార్ఘ రూపను తేజఃప్రభుఁ డనువాఁడు ఆకస్మికముగా హరించి కొని పోవుచున్నాడు. ప్రభూ, ఆమె విద్యాధరచక్రవర్తి పత్ని యగు నని సిద్ధులు వక్కాణించి యున్నారు. కనుక ప్రభూ, చాలదూరము బలాత్కారమునఁ గొనిపోక ముందే ఆమెను విడిపించి కాపాడుము' ఇట్లు బేతాళుఁడు మొఱపెట్టగాఁ దేవుఁడు 'పొండి, ఆమెను విడిపింపుఁడు.' అని మమ్ము ఆజ్ఞాపించెను. మేమును ఆకాశమార్గమునఁ బోయి ఆమెను చూచితిమి 'చక్రవర్తి శ్రుతశర్మకొఱకు ఆమెను కొనిపోవుచున్నాను.