Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

816

కథాసరిత్సాగరము. లం. 8. త. 5

మహాయువును ఒండొరువులచే మడిసిరి. జంబీరకుఁడును నీరసకుఁడును ఖర్వుఁడును ఉగ్రవిక్రముఁ డయిన సుశర్మము భుజములు తెగిపోఁగా దంతములతో కఱచుచుం బోరిరి. శత్రు భట వ్యాఘ్రభట సింహభటు లనెడు మువ్వురును ప్రవహణుఁడను విద్యాధరరాజుచేత మడిసిరి సురోహవిరోహు లిరువురును ప్రవహణుని కూల్చిరి. శ్మశానవాసి యగు సింహబలునిచే వా రిరువురుం గూలిరి. ప్రేతవాహనుఁ డగు సింహబలుఁడు, కపిలకుఁడు, చిత్రాపీడుఁడు, జగజ్జ్వరుఁడు, కాంతాపతి, సువర్ణుఁడు, కామఘనుఁడు, క్రోధపతి, బలదేవుఁడు, విచిత్రాపీడుఁడు, అను పదుగురను రాజపుత్త్రుఁడు శతానీకుఁడు పరిమార్చెను.

ఇట్లు విద్యాధరవీరులక్షయమును చూచి క్రుద్ధుఁ డై శ్రుతశర్మ స్వయముగా శతానీకుని మీఁదికి పోయెను. వారికి సాయంకాలమువఱకు మహాసైన్యక్షయకర మైన యుద్ధము దేవతలకుంగూడ ఆశ్చర్యకరముగా జరిగెను. నూర్లకొలఁదియు మొండెములు ఎల్లయెడల లేచి సంధ్యానృతోత్సవాగమమున భూతములకు ఆలంబము లయినవి సాయంకాలము కాఁగా యుద్ధము మాని బహుసైన్యవినాశముచే దిగులుపడి బంధు మరణ శోకార్తు లై విద్యాధరులును, జయోత్సాహవంతు లై మర్త్యాసురులును, తమతమ శిబిరములకుఁ బోయిరి.

ఆసమయమున ఇద్దఱు విద్యాధరేశ్వరులు రథయూథపాధిపతులు శ్రుతశర్మపక్షము వదలి వచ్చి సుమేరు నివేదితు లై