ప్రభాసుని యుద్ధము.
815
మహాపరాక్రమశాలులు. కోపాంధుఁ డయిన యా శ్రుతశర్మతోడి యాయైదుగురతోను ప్రభాసాదులు మువ్వురును పోరిరి. వారు పరస్పరము ప్రయోగించు బాణసమూహము ఆకాశములో రణలక్ష్మికి ఎండ వేఁడిమి నివారించుటకై కట్టిన మేలు కట్టువలె నుండెను. అంతట పూర్వము విరథు లయి పాఱిపోయిన విద్యాధరులును వచ్చి కలసిరి. అట్లు ప్రభాసాదులను మువ్వురను శ్రుతశర్మాదులనేకులు మార్కొనఁగా చూచి సూర్యప్రభుఁడు ప్రభాసాది సాహాయ్యార్థము మహారథు లైన వీరసేన శతానీకాది వీరులను రాజకుమారులను ప్రజ్ఞాఢ్య సహితులను మిత్త్రులను భూతాసనవిమానములో ఆకాశమార్గమున పంపెను. ఆధనుర్ధరు లందఱును రథము లెక్కఁగా మిగిలిన విద్యాధరేంధ్రులును శ్రుతశర్మయొద్దకు వచ్చిరి. ప్రభాసాదులతోఁ గలసిన వీరసేనాదివీరులకును విద్యాధరేశ్వరులకును మహాసైన్యక్షయావహ మయిన మహాయుద్ధము ఆరంభ మాయెను. అచట రెండుసేనలలోను ద్వంద్వయుద్ధములు జరిగి మానుషాసురఖేచరులు అనేకులు మడిసిరి. వీరసేనుఁడు ధూమ్రలోచనుని సానుచరుని కూల్చెను. వీరసేనుఁడును హరిశర్మచే విరథీకృతుఁ డాయెను. విద్యాధరవీరుఁడు హిరణ్యాక్షుఁడు అభిమన్యునిచే చచ్చెను. అభిమన్యుని, హరిభటుని, సునేత్రుఁడు చంపెను. సునేత్రుని ప్రభానుఁడు శిరశ్ఛేదము కావించెను. జ్వాలామాలియు