814
కథాసరిత్సాగరము. లం. 8. త. 5
కనిపట్టి బాణసమూహములతోఁ గొట్టఁగా ఆ యిరువురును పాఱిపోయిరి. ప్రభాసుఁడు కడమ పండ్రెండుగురతోసు పోరుచు వారివిండ్లను క్రొత్తవానిని పల్మాఱు చేకొన్నను కొట్టివైచెసు. ప్రహస్తుఁడు వచ్చి ఆ శత్రువుల సారథులను ఒక్కమాఱే చంపెను. కుంజరకుమారుఁడు వారి గుఱ్ఱములను కూల్చెను. అంతట ఆ పండ్రెండుగురు విరథు లై ఆమువ్వురువీరుల ఢాకకు ఓర్వలేక యుద్ధమునుండి పాఱిపోయిరి.
అంతట శ్రుతశర్మ దుఃఖక్రోధలజ్జావిష్ణుఁడై యిద్దఱను రథాతిరథయూథపతులను విద్యాధరులను పంపెను. ఒకఁడు చంద్రకులాద్రీంద్రరాజుభార్యయందు చంద్రునికి పుట్టినవాఁడు అపరచంద్రుఁడో యనఁ దగు నందగాఁడు చంద్రగుప్తనాముఁడు. ఇతరుఁడు ధురంధరాచలాధీశుని భార్యయందుఁ దనకే పుట్టినవాఁడు తనమంత్రి మహాతేజస్కుఁడు నగరంగమనాముఁడు. వీరును బాణసమూహమును ప్రయోగించి క్షణములో విరథీకృతు లయి ఆప్రభాసాదులతో యుద్ధము మాని పాఱిపోయిరి. అంతట మనుజాసురులు హర్షకోలాహలము చేయుచుండఁగా శ్రుతశర్మ స్వయముగా నలువురు మహారథులను వెంటఁగొని వచ్చెను. వారిపేరులు వరుసగా మహౌఘుఁడు, ఆరోహణుఁడు, ఉత్పాతుఁడు, నేత్రవంతుఁడు. వారు క్రమముగా త్వష్టకు, భగునికి, అర్యమునికి, వూషకును నులయాద్యద్రినాథు లయిన చిత్రపాదాది విద్యాధరరాజుల భార్యలయందుఁ బుట్టినవారు