Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము

అట్టిసమయములోనే సుబ్బమ్మకు రోగముతురుగ బెట్టినది. డబ్బులేక యిబ్బంది పడుచున్న సమయములోనే యుపవాసమును నుప్పిడులునుచేసి తడిబట్టలు కట్ట్టుకొని రోగపడి యెక్కువ కర్చును దెచ్చి పెటినందున కామెమీద నెంతో కోపము వచ్చి రాజశేఖరుడుగారు విసుగు కొనుచుండగా, పనినిమిత్తమయివచ్చి తిరిగిపోవుచున్న యికబ్రాహ్మణుడు దగ్గఱనుండి వినియా మెనుదూషించిన లాభములేదని చెప్పి తాను వంట బ్రాహ్మణుడనుగా గుదిరెదననియు, ఆమెను మనసు వచ్చినన్నాళ్ళు రోగపడనిండనియు. జెప్పుటయేకాక వంటకు నలభీమ పాకములను మించునట్లుచేయ తా నున్నందున నిష్టమున్నచో నామె మృతినొందినను బొందవచ్చునన్న యభిప్రాయమును సహితము సూచనగా గనబఱచెను. అతని దెట్టిసత్యవాక్కోకాని యాదినము మొదలికొని తగు వైద్యుడు లేనందుననో, ఆబ్రాహ్మణుడీ పధ్యపానములు బరువుచు వచ్చి నందునో వ్యాధి ప్రబలి యొకనాడామెకు బ్రాణముమీదికి వచ్చెను . ఆదినము నక్షత్రము మంచిది కాదని పురోహితిడు చెప్పి నందున ఆమెను వీధిలోనికి గొనిపోయి గోడపక్కను భూశయనముచేసి యొకచాప యడ్డముపెట్టిరి. ఆమెయు రాత్రి జాముప్రొద్దుపోయిన తరువాత లోకాంతగతురాలయ్యెను, ఆదినము తెల్లవాఱినదనుకనింటనున్న వారందఱును పీనుగుతో జాగరము చేసిరి. మఱునాడు ప్రాతఃకాలమునుండియు సమస్తప్రయత్నములు చేసిరి . ఊరనున్న బ్రాహ్మణులలో నెవ్వరును సాహాయ్యమునకు వచ్చినవారుకారు. రాజశేఖరుడుగారు తామే వెళ్ళి యొకచోట బోగముదానియింట పీనుగులవిస్సన్నను పట్టుకొని సంగతిని దెలుపుగా అతడు బేరములకారంభించి పదియాఱురూపాయిలకు శవమును మోచుట కొప్పు 12