పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆఱవప్రకరణము. 81

జూచుచున్న యారుక్మిణి తల్లి సొదెకు వెళ్లి వచ్చి చెప్పిన ప్రకరముగా తాను నృసింహస్వామిననియు భార్యమీఁది మక్కువ తీఱక వచ్చి యావహించి నాఁడ ననియు, తనతోఁగూడ నామెను దీసికొనిపోయెద ననియు పలికెను. అంత నాపై త్యోద్రేకము పోవునట్టుగా రుక్మిణి మొగమున కేమోరాచి యామెకు తెలివి వచ్చిన మీఁదట లోపలికిఁగొనిపోయి శైత్యోపచారములు చేయుఁడని దగ్గఱ నున్న వారితో జెప్పి, హరిశాస్ర్తులు వచ్చి రుక్మిణిని పట్టినది మొండిగ్రహ మనియు, మహ మంత్రముచేతఁ గాని శాబరముల చేత సాధ్యము కాదనియు, అయినను తానుజేసిన తపస్సంతయు ధారపోసి వదలఁగొట్టెద ననియుఁ జెప్పి, రాత్రికి తొమ్మిదిమూరల క్రొత్త వస్త్రమును, అఖండమునిమిత్తము మణుగు నేయియు పుష్పములను, ఆఱుమూరల జనపనారత్రాడును, నాలుగుమేకులను, రెండుకుంచముల నీరుపట్టు లోత్తెన యిత్తడిపళ్లెమును సిద్ధముచేయించి రెండవ త్రోవలేని యొకగదిని గోమయముతో నలికించి యుంచుఁడని రాజశేఖరుఁడు గారితోఁ జెప్పిపోయెను. రాజశేఖరుఁడుగారా ప్రకారము సర్వము జాగ్రత్తపెట్టించి యాతనిరాక కెదురుచూచు చుండిరి. అతఁడు రాత్రితొమ్మిదిగంట లయినతరువాత వచ్చి గదిలో అఖండ దీపమును వెలిఁగించి; అమ్మవారి పెట్టెను దాని సమీపమున నుంచి, బియ్యపు ముగ్గుతో గదికి నడుమ నొక చిన్న పట్టుపెట్టి యందులో రుక్మిణిని గూరుచుండబెట్టి కొంచెముసేపు తనలో నేమో మంత్రమును జపించి దిగ్భంధనము చేసి గది నాలుగు మూలలను మంత్రోదక