Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/900

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ రిపన్ ప్రభు స్వాగతము

ఉ.శ్రీమహనీయసత్కృపను జీమ మొదల్ ద్విరదం బుదాఁకఁదా
నీమహిఁ గల్గుజంతువుల నెల్ల సతంబు సమానదృష్టితొఁ
బ్రేమను బ్రొచు నిశ్వరుఁడువిశ్వతురుండు రిపక్ ప్రభూ తమున్
క్షేమ చిరాయురున్నతులఁ జెన్నువహింపఁగజెసి ప్రొచుతన్.

సీ.ఎలమితొ నెవ్వఁ డిహిందువులకు స్దాని
కస్వపరిపాలన మియ్యఁగట్టుచేసె
నాంగ్లేయు లపరాదులై నను శీక్షింప
నెవఁడీచ్చె నధికార మిచట్టి ప్రజకు
పరదేశ ముననుండీ సరకులు తెప్పింప
కిచటివృత్తు లెవఁడు వృద్ధి గూర్ప
నట్టిఘనుఁడు రిపన్ ప్రభు వరుగు దెంచు
నేఁఢు మనరాజధానికి న్లఁతలార.

ఉ,కావున నిటిగొప్పయుపకారము లెన్నియు చేసినట్టియూ
ధివిభవున్ నృపప్రతినిధిక్ మన మేల్లను గాంతలార! సం
భావన ఛైసి మంగలముపాడి కృతజ్ఞతఁజూపఁజెల్లుము
న్నా వర పాకున్ మనకుస్ంపినవారలయందుఁగూరిమిన్.

నాదనామక్రియ రగము-చాపుతాళము

పల్లవి-మంగళమ్-మహిపాలచంద్రా! మంగళమ్
అనుపల్లవి-మంగళం కరుణాంత రంగ దుర్జనభంగ
రంగదఖీలమహ రాజసంసెవితా. మంగళం.