పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/894

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెన్నపురి భ్రహ్మోపాసనామందిర ప్రతిష్టాపనము

<poem> చ.అటువలె నొక్కఈశ్వరున యర్చన మాననీకంబుగా భువి౯

బటుమతిఁ జేయు పద్దతిని భానీల నేఁబది యేండ్ల క్రిందట౯
ఘటన యొనర్చి దేశమున గల్గుజనంబుల కెల్ల జాటి యా
దట నొనరించె నాతఁడు మతంబున కెల్ల మహోపకారమున్.

మ. ఘనుఁ దాతండు దివంబుఁ జేర వెనుకం గాపాడి యబ్దానిఁ బొం

దెను సత్కీర్తి మనీషులెల్ల బొగడ౯ దేవేంద్రనాధుం డహో
వినుతిం జెందదే యాది బ్రహ్మమతమ౯పేరన్ జగంబందు నీ
యన స్తాపించిన సత్సమాజ మిపుడొయ్య ంసర్వ సమ్మాన్యమై.
ఉ. ఈయన పండితోత్తముల నేపునఁ బంచెను వారణాసికిన్
బోయి సమస్త వేదచయముం బఠియింపఁగ వారు వచ్చి యా
మ్నాయములుం బరీక్షగా విమర్ష యొనర్పగ నందు దోషముల్
పాయక కొన్ని కంపడియెఁ బాసెను వాని ప్రమాణ భావమున్.
చ. వెనుకను బ్రాహ్మధర్మ మనుపేరను గ్రంధ మొకండుచేసె నీ
యన ఘుఁడె తా శ్రుతిస్మృతులయందలి వాక్యము లేర్చికూర్చియీ
యన ఘనకీర్తిఁ గాంచి ముద మారఁగఁ గేశవచంద్ర సేనులు౯
ఘనతర భక్తి జేరెను ఘనంబుగ బ్రాహ్మ సమాజము వడిన్.
చ.ఇతడు ప్రసంగము ల్సలుప నెల్లర రంజిలఁ జేయ దక్షుడై
ప్రతిభమొయిం జగంబునను బ్రాహ్మనసమాజము వన్నె కెక్క నం
చితగతి జేసి శ్లాఘ్యతను జెంది సమాజము కార్యదర్శియై
యతులితసాహసంబున సహాయులన గూడి త్యజించె వర్ణమున్.
ఉ. కేశవచంద్రసేను లిటు కేవల ధైర్యముతోడ వర్ణమున్
పాశము త్రెంచి యాదిమవుబ్రాహ్మనసమాజమువారు తన్ను గ్రూ
రాశయములై వడి ంవిడున నంతటవీడియు వారి నెయ్యవుం
బాశము హిందూ దేశపు సమాజము సమాజము స్తాపన చేసె నేఋగన్.