పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/892

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
స్త్రీ విద్య
చదువ కుండినయంతనె చానలెల్ల,
ఱంకుటాం డ్రౌదురని మున్నుఱంతునేసి
యన్నవా రెవ్వరో వారి నడుగవలయు,
నేను విద్దెచే వెలిచెవి మానునంటి.

సీ. తెఱవలు చదివిన ధీమతు లయ్యెద

రఁ ట కాని వంటక మారగింప
బలమేపు రాదట బాగుబా గోరెంబు
గుడువక యుండినయెడల బలము
తప్పక క్షీణించుఁ దధ్యంబు మామత
మదియె ముమ్మాటికి నార్యులార
చర్చించి చూడ నష్ట+అ+వకారాకార
ధానుల తెఱ గేమొ కాని తలప
మఱియుఁదన దేహమే తాను మఱచియుండు
నున్మదాగ్రణికి సృగాల మొక్క ద్వీపి
ద్వీపి యొకసృగాలంబునై యోపకున్నె
దనిబాటిబట్టుటె వెఱ్ఱితనము గాక.

ఉ. ఏమిటి కీవృధాచలము లీవఱ కన్నియునయ్యె నింక గా

లామృత మాదిగా మిగిలె నందును గాదన నేల చూపెదన్
కామిని కక్షరాభ్యసనకార్యము గల్గు దాని గాంచి తా
రీ మఱి పూర్వనాగరికు లేమని యందురొ చూత మీ పయిన్.

తే. అక్షరాభ్యాసయోగంబు నతివలకును

నల్ల జ్యోతిషమాధవీయంబునందుఁ
గలుగగా జెప్పె గావున నెలమి మీఱ
దానినీక్రిందనిదిగొ యుదాహరింతు.